మళ్లీ కామెడీ ట్రాక్‌లోకి అల్లరి నరేశ్.. హీరోయిన్‌ను పరిచయం చేసిన మేకర్స్

తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాలుగా అలరించిన అల్లరి నరేశ్ మరోసారి పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల వరుసగా విభిన్న కథలతో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు మళ్లీ తనకు మంచి పేరు తీసుకొచ్చిన కామెడీ జానర్‌తో మళ్లీ రాబోతున్నాడు.

Allari Naresh and Surabhi from the upcoming Telugu comedy film Rambha Urvashi Menaka, as the makers officially introduce the heroine and unveil the latest movie update.

అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటిస్తున్న 65వ చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. చంద్రమోహన్ చింతడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ మంగళవారం ఓ కీలక అప్‌డేట్ ఇచ్చారు. చిత్రంలోని 'నా కంటి మీద కునుకే' పాట ప్రోమోను విడుదల చేయడంతో పాటు, ఈ సినిమాలో కథానాయికగా సురభి నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అంతేకాదు, ఇటీవల విడుదలైన ఫస్ట్-లుక్ పోస్టర్ కూడా సినిమాపై అంచనాలను పెంచింది. స్వర్గంలోని మెట్లపై కూర్చుని, చేతిలో రంభ, ఊర్వశి, మేనక పేర్లున్న తాళపత్రంతో స్టైలిష్‌గా కనిపించిన నరేశ్ లుక్ ఆకట్టుకోవడంతో ఈ సినిమా సరికొత్త కాస్మిక్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతోందనే సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి.

అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేశ్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటి ప్రముఖ హాస్యనటులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఈ చిత్రంలో వినోదానికి కొదవ ఉండదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

కొంతకాలంగా 'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' వంటి సీరియస్ చిత్రాలతోనూ ప్రేక్షకులను మెప్పించిన అల్లరి నరేశ్, ఈ సినిమాతో మరోసారి పూర్తి స్థాయి కామెడీ వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ravindra G

Ravindra G

✓ Verified
SEO Content Writer & Webdesigner

మేము ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా వార్తలు, అన్ని ప్రభుత్వ ఉద్యోగలకు సంబంధించిన పుస్తకాలు న్యూస్ తాజా అప్‌డేట్లను ఆధారంగా పరిశీలించి, నమ్మదగిన, ఖచ్చితమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడం మా లక్ష్యం. News

Post a Comment

Previous Post Next Post

Contact Form