కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ కల నిజం చేసుకునే సువర్ణావకాశం వచ్చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయుయేట్ లెవెల్ (CGL) ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ను 21 మే 2026న అధికారికంగా విడుదల చేసింది.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లు, సంస్థలలో ఖాళీగా ఉన్న సుమారు 12,256 గ్రూప్-బి (Group B), గ్రూప్-సి (Group C) పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది అభ్యర్థులకు ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఉద్యోగాలను పొందేందుకు ఈ పరీక్ష ద్వారా పోటీపడవచ్చు.
అర్హత కలిగిన అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కొత్త అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు వేర్వేరు పే-లెవెల్స్ (Pay Levels) పరిధిలోకి వస్తాయి. అభ్యర్థి ఎంపికయ్యే పోస్టును బట్టి జీతభత్యాలు, ఇతర సదుపాయాలు ఉంటాయి. గ్రూప్-బి కేటగిరీలో ఆఫీసర్ స్థాయి పోస్టులు, గ్రూప్-సి కేటగిరీలో అసిస్టెంట్ మరియు క్లరికల్ స్థాయి పోస్టులు ఉన్నాయి.
📅 ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 21 మే 2026
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 21 మే 2026
- దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 22 జూన్ 2026
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులను వాటి పే గ్రేడ్ ఆధారంగా విభజించారు. వీటికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారీ జీతంతో పాటు ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.
గ్రూప్ 'B' పోస్టులు: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సబ్-ఇన్‌స్పెక్టర్ (CBI) మొదలైనవి.
గ్రూప్ 'C' పోస్టులు: ఆడిటర్, అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, టాక్స్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ మొదలైనవి.
