Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు అద్భుత ప్రదర్శనతో దుమ్మురేపుతోంది. ఈ ఏడాది టోర్నీలో ఆరంభంలో కొంచెం విఫలం అయిన తరువాత మ్యాచ్‌ల్లో పక్కా వ్యూహాలతో బరిలోకి దిగుతున్న ఆరెంజ్ ఆర్మీ, మైదానంలో ఎదురులేని శక్తిగా మారింది. ఫలితంగా, టోర్నీలో వరుసగా 5 అద్భుత విజయాలను తమ ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది.

IPL 2026: Abhishek Sharma’s century, Eshan Malinga's four-fer power SRH to third win on the trot

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా ఏ విభాగంలో చూసినా సన్‌రైజర్స్ ఆటగాళ్లు సమష్టిగా రాణిస్తున్నారు. ఓపెనర్లు క్రీజులోకి రాగానే విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడుతుండగా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఆ బాధ్యతను సమర్థవంతంగా మోస్తూ భారీ స్కోర్లు సాధిస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగం విషయానికి వస్తే, పేసర్లు మరియు స్పిన్నర్లు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ, పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు.

ప్రస్తుతం ఆరంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ కూడా మనవే. బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 209.35 స్ట్రైక్ రేట్‌తో 425 పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు.

మరోవైపు బౌలింగ్ విభాగంలో ఈషాన్ మలింగా (Eshan Malinga) అద్భుత ప్రదర్శనతో పర్పుల్ క్యాప్ రేస్‌లో మొదటి స్థానానికి దూసుకొచ్చాడు. 9 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి టాప్‌లో నిలిచాడు. అతని బౌలింగ్ SRH విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. డెత్ ఓవర్లలో అతని యార్కర్లు, వేరియేషన్స్ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నాయి.

Post a Comment

Previous Post Next Post

Contact Form