ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్ 1 పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ (92) వీరోచిత పోరాటం చేసినప్పటికీ, చివరి బంతికి కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.
టైటాన్స్ ఇన్నింగ్స్: గిల్, బట్లర్ మెరుపులు
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 45 బంతుల్లో 70 పరుగులతో (4 ఫోర్లు, 5 సిక్సర్లు) జట్టును ముందుండి నడిపించాడు. ఓపెనర్ జోస్ బట్లర్ 27 బంతుల్లోనే 52 పరుగులతో విరుచుకుపడగా, వాషింగ్టన్ సుందర్ తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీతో (32 బంతుల్లో 55 పరుగులు) మెరిశాడు.
రాహుల్ 'ఒంటరి' పోరాటం
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్ కేఎల్ రాహుల్ అండగా నిలిచాడు. కేవలం 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు చేసి జట్టును గెలుపు అంచుల్లోకి తీసుకెళ్లాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (41) వేగంగా ఆడినప్పటికీ, రషీద్ ఖాన్ (3/17) అద్భుత స్పెల్‌తో ఢిల్లీని దెబ్బతీశాడు.
చివరి ఓవర్ డ్రామా
అప్పటివరకు బాగా ఆడిన డేవిడ్ మిల్లర్ ఆఖరి ఓవర్‌లో రెండు బంతులకు రెండు పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆఖరి బంతిని ప్రసిద్ధి కృష్ణ షోల్డర్ మీదకు వేయగా, డేవిడ్ మిల్లర్ మిస్ చేయడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.
ఏదేమైనా సరే డేవిడ్ మిల్లర్ మాత్రం మెచ్చుకోవాల్సిందే. గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ అయినప్పటికీ మళ్లీ గ్రీజులోకి వచ్చి, గుజరాత్ వైపు ఉన్న మ్యాచ్‌ను ఒక్కసారిగా ఢిల్లీ వైపు తిప్పేశాడు.
