మనలో చాలామంది కాయ ఎక్కడ వస్తుందంటే పువ్వు నుండి వస్తుందని చెబుతారు అయితే ఈ కాయ అనేది దీనికి చాలా చాలా విరుద్ధంగా ఉంటుంది అంతే దీని సైజు కూడా మనం చూసే పండ్ల కంటే చాలా ఎక్కువగా ఆ పండే పనస పండు అయితే ఇప్పుడు పనస పండు గురించి కొన్ని విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం.
పనస పండు అనేది చిట్టి యొక్క కాండం నుండి రావడం జరుగుతుంది దీని సైజు అనేది కొంచెం ఎక్కువగాను బరువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక సాధారణ పనస పండు 3 అడుగుల పొడవు వరకు పెరిగి, దాదాపు 45 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇది ఎంత బరువుగా ఉంటుందంటే.. దీన్ని మోయడానికి వెయిట్ లిఫ్టర్లు కావాలేమో అనిపిస్తుంది.
ఇది వందలాది పువ్వుల అండాశయాల కలయికతో ఏర్పడే అద్భుత నిర్మాణం. ఒకే పండులో దాదాపు 500 గింజలు ఉంటాయి. మనలో చాలామంది పనసకాయలోని బయట ఉన్న భాగాన్ని తిని లోపల ఉన్న గింజలను అయితే బయటపడవేస్తూ ఉంటారు వీటిని ఉడకబెట్టి తినడం వల్ల మన శరీరానికి మంచి పోషకాలు అందుతాయి విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండడం వల్ల వారాల్లో రెండుసార్లు అయినా మంచిది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద పనస పండు 2024లో అమెరికాలోని ఫ్లోరిడాలో నమోదైంది. హ్యూ ఫోర్త్‌మాన్ అనే వ్యక్తి పండించిన ఈ పండు ఏకంగా 54.43 కిలోల బరువు తూగి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ రికార్డింగ్ ఇంకా బ్రేక్ అయితే కాలేదు బ్రేక్ అయ్యే అవకాశం అయితే కొంతమంది చెబుతున్నారు.
