Railwaysalert:ప్రయాణికులకి బ్యాడ్ న్యూస్ March 1 నుంచి ఈ సదుపాయం రద్దు

రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్! యూటీఎస్ (UTS) యాప్ సేవలు త్వరలో నిలిపివేయనున్నట్లు సమాచారం. మార్చి 1వ తేదీ నుంచి ఈ యాప్ ద్వారా ఎలాంటి టికెట్ బుకింగ్ లేదా ఇతర సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించారు.

ఇప్పటివరకు ఈ UTS App ద్వారా జనరల్ టికెట్లు, సీజన్ పాసులు, ప్లాట్‌ఫామ్ టికెట్లు వంటి సేవలను సులభంగా పొందేవారు. ముఖ్యంగా క్యూ లైన్‌లో నిలబడకుండా మొబైల్ ద్వారా టికెట్ తీసుకునే సౌకర్యం ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడింది.

Railways Breaking News: ఈ ఫెసిలిటీకి గుడ్‌బై

కానీ మార్చి 1వ తేదీ నుంచి ఈ యాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. Indian Railways Update ప్రకారం, ఈ యాప్ స్థానంలో కొత్తగా Rail One App ప్రవేశపెడుతున్నారు.

ఇక నుంచి రైల్వే ప్రయాణికులకు సంబంధించిన అన్ని సేవలు ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానున్నాయి. “రైల్ వన్” యాప్ ద్వారా Railway Ticket Booking, Unreserved Tickets, Reserved Tickets వంటి సౌకర్యాలు ఒకేచోట లభించనున్నాయి.

ఈ యాప్‌లో రిజర్వేషన్ మరియు అనరిజర్వ్డ్ టికెట్ల బుకింగ్, సీజన్ పాసులు, ప్లాట్‌ఫామ్ టికెట్లు వంటి సేవలతో పాటు PNR Status Check, Live Train Tracking, సీటు లభ్యత వివరాలు కూడా చూడవచ్చు. అంతేకాకుండా రైల్లోనే ఫుడ్ ఆర్డర్ చేసే సౌకర్యం, ప్రయాణ సమయంలో ఎదురయ్యే సమస్యలపై ఆన్‌లైన్ ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది.

యూటీఎస్ యాప్‌లో మీ R-Wallet Balance ఇప్పటికే ఉంటే అది పూర్తిగా సురక్షితం. ఆ డబ్బు లాస్ అవ్వదు. అదే మొత్తాన్ని కొత్త Rail One యాప్‌లో ఉపయోగించుకోవచ్చు.

రైల్ వన్ యాప్‌లో అనరిజర్వ్డ్, ప్లాట్‌ఫామ్ టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ప్రయాణికులు తాజా అధికారిక ప్రకటనలను గమనించి కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.

Keywords: UTS App discontinued, Rail One App launch, Railway passengers alert, March 1 railway update, Indian Railways news, Railway ticket booking app, R Wallet balance safety, PNR status check online, Live train tracking app India

Post a Comment

Previous Post Next Post

Contact Form