Online Passport Application 2026 – ఇంట్లోనే చేయవచ్చు!

మన దేశంలో పాస్‌పోర్ట్ సేవలు ఇప్పుడు పూర్తిగా డిజిటల్‌గా మారాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, అర్హత కలిగిన ప్రతి పౌరుడు అధికారిక పాస్‌పోర్ట్ పోర్టల్ ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయానికి ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి, సమీపంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అవసరమైన పత్రాల ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల్లో అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు సేకరించబడతాయి, తద్వారా ప్రభుత్వం ఆధునిక, సురక్షిత ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తుంది.

పోలీస్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పాస్‌పోర్ట్ నేరుగా అభ్యర్థి ఇంటికి పంపబడుతుంది. ఈ కొత్త డిజిటల్ విధానం వల్ల పాస్‌పోర్ట్ పొందే ప్రక్రియ మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మారిందని అధికారులు తెలిపారు. విదేశాల్లో టూర్లకు వెళ్లాలన్నా, ఉన్నత చదువుల కోసమైన, ఉద్యోగాలకైనా పాస్‌పోర్ట్ తప్పనిసరి.

Online Passport Application 2026 India step by step guide

టెక్నాలజీ పెరిగి ప్రస్తుత ప్రపంచంలో దీని దరఖాస్తు ప్రక్రియ కుడా సులభంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తోంది. ఇవి ప్రయాణీకుల భద్రతను పెంచడమే కాకుండా అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి.

ఈ - పాస్‌పోర్ట్ అనేది ఇదివరకు మనం ఉపయోగించిన పాస్‌పోర్ట్‌ల లాగే ఉంటుంది, కాని ఈ ఈ - పాస్‌పోర్ట్ కవర్‌పై ఒక చిన్న చిప్ అమర్చి ఉంటుంది. ఇందులో మీ వేలిముద్రలు, ఐరిస్, వ్యక్తిగత వివరాలు డిజిటల్‌గా రూపంలో సేఫ్‌గా ఉంటాయి. తద్వారా ట్యాంపరింగ్, నకిలీల సమస్య ఎదురుకాదు.

ఈ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడం ఇప్పుడు పూర్తిగా ఆన్‌లైన్‌లో సులభం అయ్యింది. అధికారిక పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ passportindia.gov.in లో లాగిన్ అయ్యి ‘New User Registration’ ద్వారా కొత్త యూజర్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత ‘Apply for Fresh Passport’ ఆప్షన్‌ని ఎంచుకుని వ్యక్తిగత మరియు కుటుంబ వివరాలను నింపాలి. దరఖాస్తు సమర్పించిన తరువాత ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత రుసుమును చెల్లించాలి. ఫీజు చెల్లింపు పూర్తయ్యాక, అభ్యర్థి తన సమీపంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అనుకూలమైన తేదీ కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.

అవసరమైన డాక్యుమెంట్లు:

  • దరఖాస్తు సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్లు మీ వెంట ఉండాలి.
  • చిరునామా, గుర్తింపు కోసం ఆధార్ కార్డు
  • జనన ధృవీకరణ పత్రం లేదా 10వ తరగతి మార్కుల మెమో
  • పాన్ కార్డు, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్
  • అవసరమైతే బ్యాంకు పాస్ బుక్

పాస్‌పోర్ట్ ఫీజు వివరాలు:

  • 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ (పెద్దలకు) కోసం రూ. 1,500
  • 60 పేజీల పాస్‌పోర్ట్ కోసం రూ. 2,000
  • 18 ఏళ్ల లోపు మైనర్లకు 5 ఏళ్ల కాలపరిమితితో జారీ చేసే 36 పేజీల పాస్‌పోర్ట్ రూ. 1,000

Post a Comment

Previous Post Next Post

Contact Form