Kidney Health Tips: కిడ్నీలు సేఫ్‌గా ఉండాలంటే ఈ 10 ఆహారాలు తప్పక తినండి

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు (మూత్రపిండాలు) ఒకటి. శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడం, రక్తాన్ని శుభ్రపరచడం, నీటి సమతుల్యతను కాపాడడం, రక్తపోటును నియంత్రించడం వంటి కీలక పనులు కిడ్నీలు నిర్వహిస్తాయి. మనిషి శరీరంలో ఎక్కువ ఒత్తిడి పడే అవయవాలు కూడా మూత్రపిండాలే.

ఇవి రక్తాన్ని వడకడుతూ, వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తాయి. మన శరీరంలోని నీరు, ఉప్పు, ఖనిజాల స్థాయులను బ్యాలెన్స్ చేస్తాయి. రక్తపోటును నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేయడంతో పాటు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని కూడా పెంచుతాయి. ఇన్ని పనులు చేసే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటూ సరిగా పని చేయాలంటే వాటిపై ఒత్తిడిని తగ్గించే ఆహారాలు తినాలి.

Best 10 foods for healthy kidneys and kidney protection tips

మూత్రపిండాల (కిడ్నీల) ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన ఆహారం ఎంపిక చాలా కీలకం. నిపుణుల సూచనల ప్రకారం, రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక పదార్థాలను చేర్చితే మూత్రపిండాల పనితీరు మెరుగుపడటమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే కిడ్నీ సమస్యలను కూడా నివారించవచ్చు. ఇప్పుడు అలాంటి 10 ముఖ్యమైన ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఆపిల్

ఆపిల్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. షుగర్ నియంత్రణలో ఉంటే కిడ్నీలపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు యాపిల్ పండ్లలో ఉండే పెక్టిన్ అనే పదార్థం కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించగలదు. రోజుకు ఒక ఆపిల్ తినడం మంచి అలవాటు.

క్యాబేజీ

ఇందులో కిడ్నీలపై ప్రభావం చూపే పొటాషియం తక్కువగా ఉంటుంది. అలాగే వాటి పనితీరును పెంచే ఫైబర్‌తో పాటు విటమిన్ K, C పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీలో ఉండే పైటోకెమికల్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను అదుపు చేస్తాయి. ఇవి కిడ్నీలలో వచ్చే వాపును తగ్గించి, అవి సరిగా పని చేసేలా ప్రోత్సహిస్తాయి.

బ్లూబెర్రీలు & స్ట్రాబెర్రీలు

ఈ బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి కణాలను రక్షిస్తాయి.

ఆకుకూరలు

Best 10 foods for healthy kidneys and kidney protection tips

పాలకూర, తోటకూర, ఇతర ఆకుకూరలు రెగ్యులర్‌గా తింటే మీ మూత్రపిండాలు బలంగా ఉంటాయి, సరిగా పని చేస్తాయి. వీటిలో విటమిన్ A, C లతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే పొటాషియం ఎక్కువగా ఉండే కొన్ని రకాల ఆకుకూరలను మాత్రం పరిమితంగా తినాలి.

వెల్లుల్లి

వెల్లుల్లి సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థం. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. హై బీపీ కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం కాబట్టి వెల్లుల్లి వాడకం మంచిది.

చేపలు (ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్)

సాల్మన్, సార్డైన్ వంటి చేపల్లో ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యం బాగుంటే కిడ్నీల పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది.

నిమ్మరసం

రోజూ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల కిడ్నీ రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. నిమ్మలోని సిట్రేట్ రాళ్ల ఏర్పాటును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఎర్ర ద్రాక్ష

ఎర్ర ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కిడ్నీ కణాలను రక్షించి ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

సంపూర్ణ ధాన్యాలు

బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమలు వంటి తృణధాన్యాలు ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

Post a Comment

Previous Post Next Post

Contact Form