RRC Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 5,349 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

Railway Recruitment Cell Western Railway కీలక ప్రకటన విడుదల చేసింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి వెస్ట్రన్ రైల్వే పరిధిలోని డివిజన్‌లు మరియు వర్క్‌షాప్‌లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 5,349 అప్రెంటిస్ ఖాళీలు ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.

RRC Western Railway Apprentice Recruitment 2026 trade-wise vacancy details table showing 5,349 posts including Fitter 1614, Electrician 1217, Welder 532 and other divisions.

రైల్వేలో ఉద్యోగం సాధించాలని ఆశిస్తున్న యువతకు ఇది ఒక మంచి అవకాశం. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, కార్పెంటర్ తదితర ట్రేడ్‌లలో నియామకాలు చేపట్టనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

క్రమ సంఖ్య విభాగం పేరు ఖాళీల సంఖ్య
1ఫిట్టర్1614
2ఎలక్ట్రీషియన్1217
3వెల్డర్532
4పీఏఎస్‌ఏఏ280
5ఎలక్ట్రానిక్ మెకానిక్236
6మెకానిక్ (డీజిల్)207
7పెయింటర్190
8కార్పెంటర్184
9రిఫ్రిజిరేటర్ (AC-మెకానిక్)184
10పైప్ ఫిట్టర్176
11ప్లంబర్136
12వైర్‌మ్యాన్126
13డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)87
14టర్నర్75
15స్టెనోగ్రాఫర్40
16మెషినిస్ట్ (గ్రైండర్)25
17ఫోర్జర్ & హీట్ ట్రీటర్16
18మెషినిస్ట్14
19మెకానిక్ మోటార్ వెహికల్10

అప్రెంటిస్‌ శిక్షణ పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో రైల్వే లెవల్ 1 ఉద్యోగాల్లో 20 శాతం వరకు వెయిటేజీ ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 23, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థుల 10వ తరగతి మరియు ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించనున్నారు. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

APPLYING LINK : CLICK HERE

Post a Comment

Previous Post Next Post

Contact Form