NZ Series లో ఫెయిల్ అయిన సంజూ శాంసన్… బెంచ్‌కే పరిమితమా?

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ వరుసగా విఫలమవడంతో, రాబోయే టీ20 ప్రపంచకప్ జట్టులో అతని స్థానం పై పెద్ద చర్చ మొదలైంది. కీలక మ్యాచ్‌లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం సంజూకు మైనస్‌గా మారింది. అవకాశాలు వచ్చినా వాటిని భారీ స్కోర్లుగా మార్చలేకపోవడం సెలెక్టర్లను ఆలోచనలో పడేసింది.

sanju-samson-nz-t20-series-failure

భారత క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ల మధ్య పోటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో, సంజూ శాంసన్ తన ఫామ్‌ను కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ అతనికి మంచి అవకాశాన్ని కల్పించింది.

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇది సంజూ శాంసన్‌కు తన సొంత రాష్ట్రంలో ఆడుతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో కేరళ అభిమానులు భారీగా తరలివచ్చారు.

అయితే సంజూ ఆటను చూడడానికి వచ్చిన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఫెర్విసన్ వేసిన ఒక బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన సంజూ, టైమింగ్ మిస్ కావడంతో బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో సంజూ కేవలం ఆరు పరుగులకే క్యాచ్‌గా అవుట్ అయ్యాడు.

సంజూ ఇకపై బెంచ్‌కే పరిమితమా?

గత కొన్ని మ్యాచ్‌లను గమనిస్తే సంజూ శాంసన్ పెద్దగా రాణించలేకపోయాడు. ఈ సిరీస్‌లో అయితే పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా 30 పరుగులు దాటిన దాఖలాలు లేవు.

ఇదే సమయంలో ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లోకి రావడం జరిగింది. అతను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు కీలకమైన ప్రదర్శన అందించాడు. ఈ కారణంగా టీ20 వరల్డ్ కప్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇషాన్ కిషన్ స్థానం దాదాపు ఖాయమని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Post a Comment

Previous Post Next Post

Contact Form