రైతుల పంట వివరాలు ఈ-క్రాప్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలి – కలెక్టర్ ఆదేశాలు

ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులు సాగు చేస్తున్న ప్రతి పంట వివరాలను ఈ-క్రాప్‌ పోర్టల్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని, జిల్లా కలెక్టర్ ఏ. సిరి సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. పంటల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ఆమె స్పష్టంగా తెలిపారు.

గురువారం టెలి కాన్ఫరెన్స్‌లో పై విభాగాలకు చెందిన అధికారులతో పంటలకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా పంటల్లో వ్యాపిస్తున్న తెగుళ్లు, క్రిమికీటకాలను నివా రించి రైతులను నష్టాల నుంచి గట్టెక్కించాలని ఆదేశించారు. వ్యవ సాయ, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా ఉండాలని సూచించారు.
కలెక్టర్ గారు మాట్లాడుతూ, ఈ-క్రాప్‌ నమోదు వ్యవసాయ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి రైతు యొక్క సాగు వివరాలు సమయానికి సరిగ్గా నమోదు చేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. పంటల సరైన రికార్డులు ఉంటే ప్రభుత్వానికి పంట బీమా, నష్టపరిహారం, సబ్సిడీ వంటి పథకాలను సులభంగా అందించగలమన్నారు.
రైతులు ఎక్కడ ఏ పంటలు సాగు చేస్తున్నారో స్పష్టమైన సమాచారం ఉంటే, నీటి పంపిణీ, ఎరువుల సరఫరా, మరియు మార్కెట్‌ ప్లానింగ్‌ వంటి అంశాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చని కలెక్టర్ సూచించారు. Telegram Join Banner వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సహాయకులు, మరియు వీఆర్వోలు గ్రామాల్లోకి వెళ్లి ప్రతి రైతు వివరాలు సేకరించి, నిర్దిష్ట గడువులోగా ఈ-క్రాప్‌ నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు.ఎవరి పరిధిలోనైనా తప్పుడు డేటా నమోదు లేదా ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని. అధికారులు ప్రతి పంట సర్వేలో ఫీల్డ్‌లో స్వయంగా పాల్గొని డేటా ఖచ్చితత్వం నిర్ధారించాలన్నారు. అలాగే రైతులు కూడా తమ సాగు వివరాలను అధికారులకు సమయానికి తెలియజేయడం, ఆధార్ మరియు భూ వివరాలు సరిగ్గా ఇవ్వడం ద్వారా సహకరించాలన్నారు. Website Popup Message

Post a Comment

Previous Post Next Post

Contact Form