జంతు మలంతో కాఫీ ప్రపంచంలో ఖరీదైన కాఫీలలో ఇదే నెంబర్ వన్ రేటెంతో తెలుసా

 మనం రోజు టీ లేదా కాఫీ తాగితే ఎంత ఖర్చు అవుతుంది సుమారు పది నుండి 20 రూపాయలు ఖర్చు అవుతుంది ఒకవేళ మనం పెద్ద పెద్ద కాఫీ షాపుల్లోకి వెళ్లి తాగితే 100 నుండి ఒక 200 అయితే ఖర్చు అవుతుంది.ప్రపంచంలో కొన్ని కాఫీలు అంత ప్రత్యేకం,ఆ కాఫీ తయారు చేసే విధానం అది ఎక్కడ నుండి వస్తుంది అనే వాటి ఆధారంగా కొన్ని కాఫీలునైతే బయట మార్కెట్లలో ఎక్కువ మొత్తంలో అమ్మడం జరుగుతుంది వాటిని మనం కొన్నామంటే నన్ను జోబి ఖాళీ అయినట్టే.ఆ కాఫీ తాగాలంటే అంత ఈజీ కాదు — సింపుల్‌గా మీరు కనీసం రూ.1600 నుంచి రూ.8000 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది! దీనిని సివెట్ కాఫీ లేదా కోపి లువాక్ కాఫీ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీలలో ఒకటి


ఈ కాఫీకి ప్రత్యేకత ఏమిటంటే — ఇది సాధారణంగా కాఫీ గింజలతో తయారు చేయబడదు. సివెట్ అనే చిన్న జంతువు (ఒక రకమైన పిల్లి జాతి ప్రాణి) కాఫీ పండ్లు తినగానే, వాటి లోపల ఉన్న గింజలు దాని శరీరంలో ఒక ప్రక్రియకు లోనవుతాయి. ఆ తరువాత ఆ గింజలను శుభ్రం చేసి, ఎండబెట్టి, వేపి కాఫీగా తయారు చేస్తారుఈ విధంగా తయారైన కాఫీకి ఒక ప్రత్యేకమైన సువాసన, నాజూకైన రుచి, మరియు మృదువైన తీపి ఉంటాయి. అందుకే దీన్ని తాగడం ఒక విలాసంగా, ఒక అనుభవంగా భావిస్తారు. ప్రపంచంలోని లగ్జరీ కేఫ్‌లు, స్టార్ హోటల్‌లలో ఈ కాఫీ అందుబాటులో ఉంటుంది — కానీ మన పర్సు మాత్రం ఖాళీ అయిపోవడమే ఖాయం!


పునుగు 'పిల్లి' కాదా?

ఇది పురుగులు, పండ్లు, చిన్న కీటకాలను తింటూ అడవులు, కొండల్లో తిరిగే ఒక జంతువు. చెట్లు ఎక్కడంలో ఇది చాలా చాకచక్యంగా ఉంటుంది. ఈ పునుగు పిల్లి శరీరంలో ఒక ప్రత్యేకమైన సువాసన గ్రంథి ఉంటుంది, దాని వాసన చాలా మత్తుగా ఉంటుంది. అందుకే గతంలో ఈ గ్రంథి నుంచి తీసిన సారాన్ని పర్ఫ్యూమ్ తయారీలో విస్తృతంగా వాడేవారు.

Tags

civet coffee, kopi luwak, expensive coffee, luxury coffee, unique coffee, coffee facts, rare coffee, wild civet, perfume ingredients, synthetic civet scent, coffee production, 


Post a Comment

Previous Post Next Post

Contact Form