ఇకపై మీ ఫోన్‌లోనే తపాలా సేవలను సులభంగా పొందవచ్చు. భారత తపాలా శాఖ (India Post) తాజాగా ఒక కొత్త మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ పేరు “డాక్ సేవా యాప్ (Dak Sewa App)”. దీని ద్వారా ప్రజలు తపాలా కార్యాలయాలకు వెళ్లకుండానే అవసరమైన సేవలను తమ మొబైల్ ద్వారా పొందగలరు. ఇది తపాలా శాఖ తీసుకున్న ఒక మంచి డిజిటల్ అడుగుగా చెప్పవచ్చు.ఈ యాప్ ద్వారా మొత్తం ఎనిమిది రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పోస్టు ట్రాకింగ్, మనీ ఆర్డర్ పంపడం, స్పీడ్ పోస్ట్ బుకింగ్, పార్సెల్ సేవలు, ఫిర్యాదు నమోదు, ఫిర్యాదు స్థితి తెలుసుకోవడం, కొత్త పిన్‌కోడ్‌లు తెలుసుకోవడం మరియు సమీప తపాలా కార్యాలయాన్ని కనుగొనడం ఉన్నాయి. అంటే, ఇప్పటి వరకు తపాలా కార్యాలయానికి వెళ్లి చేయాల్సిన పనులు ఇప్పుడు ఇంట్లో నుంచే చేయవచ్చు.
భారతీయ తపాలా శాఖకు కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. నిత్యం లక్షల మందికి వివిధ రకాల సేవలు అందిస్తోంది.అయితేఈ యాప్‌తో ప్రజలకు సౌకర్యం, సమయం ఆదా, మరియు పారదర్శక సేవలు లభిస్తాయి. ఇకపుడు పొడవాటి లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. కొన్ని ట్యాప్స్‌తోనే తపాలా సేవలను పూర్తిచేయవచ్చు. ఇది ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, పెద్దవారికి అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.తపాలా శాఖ అధికారులు చెబుతున్నట్లుగా, ఈ యాప్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. అక్కడి ప్రజలు కూడా ఇప్పుడు తపాలా సేవలను మొబైల్ ద్వారా పొందగలరు. త్వరలో ఈ యాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు చేర్చే అవకాశం ఉందని వారు తెలిపారు.
ఆడ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాపిల్ ఫోన్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డాక్ సేవల్ యాప్ అని టైప్ చేసి అక్కడ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న అధికారిక యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేసి రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి 8కి పైగా వివిధ రకాల సేవలను వినియోగించుకోవచ్చు.
Tags
What is the Dak Sewa App launched by India Post?
How to use the India Post Dak Sewa App on your phone?
What postal services are available in the Dak Sewa App?
Is the Dak Sewa App available on Android and iOS?
How can I track my parcel through the Dak Sewa App?
How does India Post provide digital postal services now?
What are the benefits of the Dak Sewa App for users?
Can I send money orders through the India Post mobile app?
How to find the nearest post office using the Dak Sewa App?
How is the India Post transforming through digital technology?
