ఘుమఘుమలాడే చికెన్ దమ్ బిర్యానీ – ఇంట్లోనే చేస్కొదాం

 బిర్యానీలలో రాజా ఏది? ఫుడ్ లవర్స్ అందరూ ఒకే మాట చెబుతారు — “హైదరాబాద్ దమ్ బిర్యాని”! ఎందుకంటే ఆ బిర్యానీ సువాసన, మసాలా నషా, రుచిలో ఉండే రిచ్‌నెస్… ఇవన్నీ కలిసొచ్చేసరికి భోజనం కాదు, ఒక మధురానుభూతిలా ఫీల్ అవుతుంది. మొదటి స్పూన్ వేసుకున్న వెంటనే మనసును హత్తుకునే ఆ ఫ్లేవర్… ఇంక ఎలా ప్రత్యేకం కాకపోతుంది?

చాలా మంది దమ్ బిర్యానీ పేరు వినగానే…

"అయ్యో… చాలా టైమ్ పడుతుందంట!"

"చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది… ఇంట్లో చేయడం కష్టమే!"

అంటూ ముందే వెనకడుగు వేస్తుంటారు.


కానీ నిజం ఏమిటంటే —

అంత ఘనంగా వినిపించే హైదరాబాదీ దమ్ బిర్యానీ వెనుక సీక్రెట్ ఏంటంటే…

పద్ధతిగా చేసుకుంటే అది ఈజీ + టేస్టీ + సూపర్ సింపుల్!


ఒక్కసారి మీరు అన్నీ రెడీ చేసుకుని స్టార్ట్ చేసినా…

మిగతా పని బిర్యానీ స్వయంగా చేసుకుంటుంది!

మీ కిచెన్‌లో నెమ్మదిగా ఎగిసే ఆ సువాసన మీకు చెబుతుంది —

“దమ్ బిర్యానీ అనేది టైమ్ టేకింగ్ కాదు… టైమ్ వర్థ్‌!” అని


Getty images



Hyderabadi Chicken Dum Biryani Ingredients :

చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు :

చికెన్‌ - కిలో

బాస్మతి రైస్- కిలో

వేయించిన ఉల్లిపాయ ముక్కలు- కప్పు

పచ్చిమిరపకాయలు- 8

లవంగాలు-8

దాల్చిన చెక్క-4

యాలకులు-7

జాపత్రి,

జాజికాయ

మరాఠి మొగ్గ

బిర్యానీ ఆకు

షాజీరా

నిమ్మరసం,

అల్లంవెల్లుల్లి ముద్ద,

జీలకర్ర,

ధనియాల పొడి,

ఉప్పు- తగినంత,

పెరుగు- రెండు కప్పులు,

నూనె- తగినంత,

కొత్తిమీర, పుదీనా- కప్పు చొప్పున,

పాలు- కొన్ని

కుంకుమపువ్వు,

ఫుడ్ కలర్ (కావాలనుకుంటే)


Getty Images



బిర్యానీ కోసం చికెన్ మారినేషన్ విధానం :


ముందుగా.. చికెన్‌ ముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు వేసి రెండు గంటలపాటు పక్కన పెట్టాలి.


ఆ తర్వాత నీళ్లను పారబోసి ముక్కలను గిన్నెలో వేసుకోవాలి.

ఇప్పుడు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి చికెన్‌ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.


తర్వాత నిలువుగా కోసిన పచ్చి మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, లవంగాలు-2, దాల్చినచెక్క, జాపత్రి, జాజికాయ, మరాఠి మొగ్గ, షాజీరా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.


ఆ తర్వాత పెరుగు వేసి బాగా కలిపి.. పైన వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కాస్తంత నూనె వేసి మరోసారి కలియబెట్టాలి. ఆ తర్వాత దాన్ని ఓ గంట పాటు పక్కన పెట్టాలి.


వేరొక గిన్నెలో  బాస్మతి బియ్యాన్ని ఇరవై నిమిషాలు నానబెట్టాలి.


దమ్ బిర్యానీ తయారీ విదానం:



స్టవ్‌పై ఒక పెద్ద గిన్నె పెట్టి అవసరైనంత నీళ్లు పోసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల నీళ్లు అన్న కొలత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఆ నీటిలో సరిపడా ఉప్పు వేసి బాగా మరిగించాలి.


నీళ్లు అరిగొస్తున్నంతలో షాజీరా, దాల్చిన చెక్క, జాజికాయ చిన్నముక్క, బిర్యానీ ఆకులు, లవంగాలు వేసి కాస్త నూనె కూడా పోయాలి. ఈ మసాలాలు రైస్‌కు అద్భుతమైన సువాసన ఇస్తాయి


మూడొంతులు ఉడికిన తర్వాత మంటను చిన్నగా చేసి చిల్లుల గరిటెతో అన్నాన్ని తీస్తూ చికెన్‌ మిశ్రమంలో పొరలా వేసుకోవాలి. ఇలా సగం అన్నం వేయాలి. దీనిపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు, నిమ్మరసం వేసుకోవాలి. కాస్త గులాబీ నీళ్లు పోసుకోవాలి. తర్వాత మిగిలిన రైస్​ను పొరలా వేసుకోవాలి


చివరి పొర వేసిన తర్వాత, పైన కొంచెం పుదీనా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కుంకుమపువ్వు పాలు (లేకపోతే కొద్దిగా ఫుడ్ కలర్), అలాగే ఒక స్పూన్ నెయ్యి చల్లాలి. ఇవి బిర్యానీకి రిచ్ ఫ్లేవర్, అందమైన రంగు, అద్భుతమైన వాసన ఇస్తాయి.


ఇప్పుడు గిన్నెకు మూత పెట్టి, ఆవిరి బయటకు వెళ్లకుండా అంచులన్నీ గోధుమపిండితో పూర్తిగా మూసేయాలి. మూతపై ఒక బరువైన పాత్ర లేదా ప్లేట్ పెట్టితే దమ్ మరింత పర్ఫెక్ట్‌గా అవుతుంది.


మొదట 10 నిమిషాలు పెద్ద మంట మీద పెట్టాలి, తదుపరి 10 నిమిషాలు మధ్యస్థ మంట, చివరగా ఇంకో 10 నిమిషాలు సిమ్‌ లో దమ్ ఇవ్వాలి. ఈ మూడు దశలు పాటిస్తే బిర్యానీ ప్రతి పొరలో ఫ్లేవర్ బాగా ఇమిడిపోతుంది.


ఇలా మొత్తం 30 నిమిషాలు దమ్ ఇచ్చాక స్టౌ ఆఫ్ చేసి బిర్యానీని 5 నిమిషాలు అలాగే ఉంచండి. మూత తీయగానే వచ్చే ఆ వాసన… ఘుమఘుమలాడే అసలైన చికెన్ దమ్ బిర్యానీ సిద్ధం


ఇప్పుడు పైన కొద్దిగా అనియన్ స్లైసులు, నిమ్మ ముక్కలు పెట్టి గార్నిష్ చేస్తే —

రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ కాదు… దానికి మించి హోమ్ స్టైల్ రిచ్ ఫ్లేవర్!

#HyderabadDumBiryani #HyderabadiBiryaniRecipe #DumBiryani #SecretBiryaniRecipe #StepByStepBiryani #TraditionalBiryani #HyderabadFood #BiryaniLovers #AuthenticBiryani #BestBiryaniRecipe

Post a Comment

Previous Post Next Post

Contact Form