మార్కెట్లోకి కొత్త కొత్త వెహికల్ అయితే వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం ఒక మోడల్ రిలీజ్ అయింది అంటే అది రిలీజ్ అయిన ఐదు ఆరు నెలలొ మరొక మోడల్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు.అలా రిలీజ్ అయిన బైక్ లేదా కారులను ఇతర వెహికల్స్ ను కొంటూ ఉంటాం. ఇలా కొనడం ఒక ఎత్తు అయితే వాటిని మెయింటైన్ చేయడం కూడా ఒక ఎత్తు .
అయితే మనలో చాలామంది వెహికల్స్ కు పెట్రోల్ లేద డీజిల్ కొట్టిస్తూ ఉంటారు అది అయిపోయేంత వరకు తిరుగుతూ ఉంటారు కొంతమంది అయితే పెట్రోల్ పూర్తిగా అయిపోయేంతవరకు తిరుగుతూనే ఉంటారు. అలా చేయడం వల్ల ఇంజన్ మీద ప్రెజర్ అనేది పెరిగి వెహికల్ యొక్క ఇంజన్ త్వరగా పాడు అవ్వడానికి అవకాశాలున్నాయి
ఎయిర్ ఫిల్టర్స్ యొక్క పని ఏమిటి
చాలామంది వాళ్ల వెహికల్స్ ను సర్వీసింగ్ చేపిస్తూ ఉంటారు సర్వీసింగ్ చేపిచ్చినప్పుడు ఇంజన్ ఆయిల్ అనేది మార్పిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంజన్లో ఫ్రిక్షన్ అనేది తగ్గి స్మూత్ గారు అవ్వుతుంది. మైలేజ్ కూడా బాగా ఇస్తుంది. అయితే ఇలా సర్వీసింగ్ చేపిచ్చినా కూడా ఎయిర్ ఫిల్టర్ ను క్లీన్ చేపించకపోయిన మైలేజ్ అనేది తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎయిర్ ఫిల్టర్ యొక్క పని ఏంటంటే బయట నుండి వచ్చే గాలిలోని దుమ్ము ధూళి ఇంజన్లోకి వెళ్లనివ్వకుండా చేస్తుంది. ఒకవేళ ఎయిర్ ఫిల్టర్ ను క్లీన్ చేపిచ్చుకపోయినా ఆ దుమ్ము ధూళి వెహికల్ లోకి వెళ్లి మైలేజ్ తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి
ఎయిర్ ఫిల్టర్ ని ఎప్పుడు క్లీన్ చేపించాలి
ఎయిర్ ఫిల్టర్ ను ప్రతి నెల క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంజన్ ఆయిల్ మార్పించేటప్పుడు ఎయిర్ ఫిల్టర్ ను కూడా క్లీన్ చేయించడం మంచిది ఒకవేళ మీరు ఎక్కువ దుమ్ము ధూళి ఉన్న ప్రదేశంలో ట్రావెల్ చేస్తుంటే రెండు నెలలకు ఒకసారి క్లీన్ చేయించుకోవడం మంచిది
