మన ఇళ్ల పక్కన లేదా ఓ మూలన ఖాళీగా పడి ఉన్న ఇనుప రాడ్లు కొద్దికాలానికే తుప్పు పట్టేస్తాయి. కానీ అదే ఇనుపతో తయారైన రైల్వే ట్రాక్స్ మాత్రం సంవత్సరాల తరబడి ఎండ, వర్షం, చలి అన్నీ ఎదుర్కొన్నా… పెద్దగా తుప్పు పట్టినట్టు కనిపించవు.మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఖాళీగా వదిలేసిన ఇనుప రాడ్లు తుప్పు పడతాయి, కానీ ఎంత కాలం వినియోగించకపోయినా సరే రైల్వే ట్రాక్స్ మాత్రం ఎందుకు తుప్పు పట్టవో! అయితే దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం!
![]() |
భారతీయ రైల్వే వ్యవస్థలో ఉపయోగించే రైలు పట్టాలు సాధారణ ఇనుముతో తయారు చేయబడవు. వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కార్బన్ స్టీల్ లేదా హై–కార్బన్ మాంగనీస్ స్టీల్ మిశ్రమాలతో తయారు చేస్తారు.ఈ మిశ్రమాల్లో కార్బన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల పట్టాలు చాలా గట్టిగా, మన్నికగా మారతాయి. అలాగే మాంగనీస్ వంటి లోహాలు కలవడం వల్ల తుప్పు పట్టే వేగం తగ్గడం, అధిక బరువు, వేగంను తట్టుకునే శక్తి పెరగడం జరుగుతుంది.
ఇంకా ముఖ్యంగా, ఈ ప్రత్యేక స్టీల్ రైలు చక్రాల వల్ల కలిగే తీవ్ర ఘర్షణ, ఉష్ణోగ్రత మార్పులు, ఎండ–వర్షాల ప్రభావంను కూడా సులభంగా తట్టుకుంటుంది. అందుకే సంవత్సరాల తరబడి నిరంతర వినియోగంలో ఉన్నా కూడా రైల్వే పట్టాలపై పెద్దగా తుప్పు ప్రభావం కనిపించదు.రైల్వే ట్రాక్‌ల మోటై (లోహం మందం) కూడా తుప్పును అడ్డుకోవడంలో చాలా కీలకమైన అంశం. సాధారణ ఇనుప వాటితో పోలిస్తే రైల్వే ట్రాక్‌లలో ఉపయోగించే ఉక్కు చాలా మందంగా, బలంగా ఉంటుంది.
![]() |
| printerest |
తుప్పు అనేది ఒక్కసారిగా లోపలికి చేరే ప్రక్రియ కాదు. అది ఒక నెమ్మదిగా జరిగే రసాయన చర్య. మొదట ఉపరితలంపై ఏర్పడి, తర్వాత క్రమంగా లోపలి పొరలవైపు చొచ్చుకుపోతుంది. కానీ ట్రాక్‌లలో లోహం మందం ఎక్కువగా ఉండటం వల్ల, ఈ తుప్పు లోతుగా చేరాలంటే సంవత్సరాల పాటు సమయం అవసరం అవుతుంది.అదనంగా, రైల్వే విభాగం ఈ పట్టాలపై తరచూ తనిఖీలు, మెయింటెనెన్స్, ప్రత్యేక రక్షణ కోటింగ్స్ చేస్తూ ఉంటుంది.

