ప్రపంచ క్రికెట్‌లో ‘కూల్ కెప్టెన్’గా విశేష గుర్తింపు పొందిన ధోనిభారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు ఈ నెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రానున్నారు..
ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి, యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడం, అలాగే రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ అకాడమీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతమైన యువతను గుర్తించి వారికి సరైన శిక్షణ అందించే దిశగా ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలపై ధోని తన అనుభవాన్ని పంచుకునే అవకాశముందని సమాచారం.
భారత జట్టుకు వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్ఠాత్మక విజయాలు అందించిన ధోని అనుభవం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ మౌలిక వసతులు మరింత బలోపేతం కావచ్చని, యువ క్రికెటర్లకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
