IPL 2026 Auction: వేలంలో షాకులు.. స్టార్ ప్లేయర్లు అమ్ముడుపోలేదు!

వచ్చే ఐపీఎల్ సీజన్‌ (IPL 2026) కోసం ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు జట్ల ఫ్రాంచైజీలు ఇవాళ అబుదాబీలో నిర్వహిస్తున్న మినీ వేలం అట్టహాసంగా ప్రారంభమైంది. క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ సాగుతున్న ఈ వేలంలో భారత స్టార్ క్రికెటర్లతో పాటు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విదేశీ ఆటగాళ్లు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయ్యారు.

ముఖ్యంగా ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు పోటీ పడి బిడ్లు వేయడంతో కొన్ని పేర్లు అంచనాలకు మించిన ధరలను సొంతం చేసుకున్నాయి.అయితే మరోవైపు, తమ జాతీయ జట్ల తరఫున నిలకడగా రాణిస్తూ గుర్తింపు పొందిన కొంతమంది దేశ, విదేశీ ఆటగాళ్లకు మాత్రం ఈ వేలంలో నిరాశ తప్పలేదు

unsoldplayers

ఇవాళ జరిగిన వేలంలో కొన్ని ప్రముఖ ఆటగాళ్లు ఏ జట్టుకీ అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, న్యూజీలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, భారత బ్యాటర్ పృథ్వీషా, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్‌తో పాటు భారత ఆటగాడు దీపక్ హుడా వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు.

కనీస ధరలకే అందుబాటులో ఉన్నప్పటికీ, జట్ల అవసరాలు, ఇప్పటికే ఉన్న ఆటగాళ్ల కూర్పు, విదేశీ ఆటగాళ్ల పరిమితి, వ్యూహాత్మక నిర్ణయాలు వంటి కారణాల వల్ల ఫ్రాంచైజీలు ముందుకు రాలేదని తెలుస్తోంది. ప్రతి జట్టు తమ ప్రణాళికలకు అనుగుణంగా ప్రత్యేక పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఇందుకు కారణంగా మారింది.

Post a Comment

Contact Form