రొయ్యల నరాలు తీసేయడం ఎందుకు అవసరం? కారణాలు తెలుసుకోండి

చాలామంది మాంసాహారులకు రొయ్యలు అంటే చాలా ఇష్టం. రొయ్యలతో పులుసు, బిర్యానీ, ఇగురు, ఫ్రై వంటి ఎన్నో రకాల వంటకాలు చేస్తారు. రొయ్యలు మెత్తగా ఉండటంతో పాటు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. రుచి మాత్రమే కాదు, రొయ్యలు తినడం వల్ల శరీరానికి కూడా మంచి పోషకాలు అందుతాయి.

ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, రొయ్యల్లో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.రొయ్యల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి.రొయ్యల్లో అయోడిన్ అనే ఖనిజం పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది థైరాయిడ్ రోగులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. రొయ్యల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరం.

అయితే, రొయ్యలను వండేటప్పుడు చాలా శుభ్రంగా క్లీన్ చేయడం అవసరం. ముఖ్యంగా రొయ్యలలో ఉండే నరాలు తీయాలని పెద్దలు చెబుతుంటారు. రొయ్యల వెనుక భాగంలో ఉండే ఆ నరంలో మలినాలు ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని తీసేయకుండా వండితే వంట రుచి తగ్గవచ్చు, అలాగే తిన్న తర్వాత జీర్ణానికి ఇబ్బంది కలగవచ్చు. అందుకే రొయ్యలను బాగా కడిగి, నరాలు పూర్తిగా తీసేసి వండటం మంచిది.

×
Website Monetization Ad

Post a Comment

Contact Form