నేను ఆ ఉద్దేశంతో అనలేదు ! నా ఉద్దేశం మంచిదే: దిగి వచ్చిన శివాజీ

రీసెంట్ గా జరిగిన దండోరా మూవీ ఈవెంట్లో శివాజీ కొన్ని షాకింగ్ కామెంట్లు అయితే చేశాడు సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవడం మానేసి పద్ధతిగా సారీస్ కట్టుకోవాలంటే కొందరిని కామెంట్ చేశాడు అనసూయ, చిన్మయిలాంటి వాళ్లు ఈ విషయం పైన ఘాటుగా స్పందించడంతో శివాజీ దిగివచ్చాడు.

నటుడు శివాజీ మంగళవారం (డిసెంబర్ 23) సాయంత్రం ఓ వీడియోను ఎక్స్‌లో రిలీజ్ చేశాడు. అందులో అతడు మహిళలందరికీ క్షమాపణ చెప్పాడు.నాలుగు మంచి మాటలు చెప్పాలని చెబుతూనే రెండు అనకూడని మాటలు అన్నాను. వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి క్షమాపణ చెబుతున్నాను. ఆ మాటలు అందరు అమ్మాయిలను ఉద్దేశించి చేసినవి కావు. నేను ఎవరినీ అవమానపరచాలని చేయలేదుఅన్నాడు

అసలు ఏం జరిగింది

మొన్న జరిగిన దండోరా మూవీ ఈవెంట్లో హీరోయిన్లు వేసుకొని డ్రెస్సులు మీద కొన్ని కామెంట్లు అయితే చేశాడు ఆ కామెంట్లు ఇప్పుడు చాలా వైరల్ గా మారాయి. ఈ కామెంట్లు చేసేటప్పుడు రెండు మూడు బూతులను కూడా యాక్టర్ శివాజీ వాడడం జరిగింది.

Sivaji అన్న మాటలు ఇవే

ఒక విషయం చెబుతున్నా. అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తదమ్మా. సామాన్లు కనపడేదాంట్లో ఏముండదమ్మా’’ అని శివాజీ అన్నారు.

అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రపు ము*.. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? మంచివి వేసుకోవచ్చు కదా అని అనాలని ఉంటుంది లోపల. కానీ అనలేం కదా. అంటే మళ్లీ స్ట్రీ స్వాతంత్రం లేదంటారు’’ అని శివాజీ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు.

గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి. ఇక్కడి (చేతులు) వరకు ఉంటే పర్వాలేదు కానీ ఇక్కడి (ఎద) వరకూ రాకూడదు’’ అని శివాజీ మాట్లాడాడు.అయితే ఇలా మాట్లాడినందుకు కొందరు హీరోయిన్లు సీరియస్ కావడం జరిగింది. అందుకు శివాజీ తన X సారీ చెబుతున్నట్టు వీడియో అయితే రిలీజ్ చేశాడు

#DandoraMovie #DandoraEvent #Shivaji #ControversialComments #Anasuya #Chinmayi #CelebrityReaction #PublicBacklash #TollywoodNews #MovieEventControversy
×
Website Monetization Ad

Post a Comment

Contact Form