నిజమైన అర్హులకు పెన్షన్లు: కలెక్టర్ల సూచనలపై సీఎం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ పథకం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమంగా కొనసాగుతోంది. ప్రతి నెలా లక్షలాది మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందుతూ తమ జీవన అవసరాలను తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హ వర్గాలకు ఈ పెన్షన్లు కీలక ఆధారంగా ఉన్నాయి.

ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో కొత్త పెన్షన్ల అంశం కీలకంగా చర్చకు వచ్చింది. పెన్షన్ల మంజూరు ప్రక్రియలో ఇప్పటివరకు కలెక్టర్లకు పూర్తి స్థాయి విచక్షణాధికారం లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో నిజమైన అర్హులు ప్రయోజనం పొందలేకపోతున్నారని కలెక్టర్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.

స్థానిక స్థాయిలో ఉన్న పరిస్థితులు, లబ్ధిదారుల వాస్తవ అవసరాలు తెలుసుకున్నప్పటికీ నిర్ణయాలు తీసుకునే అధికార పరిమితులు ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. దీంతో పాటు అనర్హులు కొందరు లబ్ధి పొందుతుండగా, అర్హులైన పేదలు పెన్షన్లకు దూరమవుతున్న పరిస్థితి ఉందని సమావేశంలో ప్రస్తావన వచ్చింది.

అయితే దినికి సంబందిచిన పూర్తి వివరాలు ఇంకా విడుదల చెయ్యలేదు‌

Post a Comment

Contact Form