తమిళంలో స్టార్ ఇమేజ్.. తెలుగులోనూ మార్కెట్.. విశాల్ కెరీర్‌లో ఏమైంది?

తమిళ సినీ ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా మిడ్‌రేంజ్‌ హీరోగా కొనసాగుతున్నాడు తెలుగువాడైన విశాల్. తన విభిన్నమైన కథలు, యాక్షన్‌ సినిమాలతో తమిళ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ‘సెండై కోళి’ సినిమాతో విశాల్‌కు తమిళనాట మంచి క్రేజ్‌ వచ్చింది. ఆ తర్వాత ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోనూ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఇక్కడ కూడా విశాల్‌కు ప్రత్యేకమైన మార్కెట్‌ ఏర్పడింది.ఒకప్పుడు విశాల్‌ సినిమాలు తమిళనాడులోని పెద్ద హీరోల చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చేవి. కథలో కొత్తదనం, యాక్షన్‌ సన్నివేశాలు, తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించేవాడు. ‘ఇరుంబు తిరై’ (అభిమన్యుడు), ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్‌) వంటి సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ పొందాయి. దీంతో విశాల్‌ సినిమాలకు రెండు భాషల్లోనూ మంచి క్రేజ్‌ ఏర్పడింది.

Vishal Tamil actor mid-range star with Telugu market and hit movies Abhimanyudu Detective

అయితే గత కొంతకాలంగా విశాల్‌కు సరైన హిట్‌ దక్కడం కాస్త కష్టంగా మారింది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ గతంలో వచ్చిన స్థాయిలో విజయాలు అందుకోవడం లేదు.ఈ మధ్య వచ్చిన మార్క్ ఆంటోనీ 100 కోట్లు వసులు చెసింది ఇదె విశాల్ కి 100 కోట్లు వసూలు చెసిన తొలి సినిమా దినితో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు అనుకున్నరందరు కాని తన కొత్త చిత్రం ‘మకుటం’తో మూడేళ్ల ముందు వంద కోట్ల వసూళ్లు సాధించిన హీరోకు ఇప్పుడు రూ.3 కోట్ల దగ్గర ఆగిపోవడం షాక్ ని ఇచ్చింది రవి అరసు అనే కొత్త దర్శకుడితో ఈ సినిమాను మొదలుపెట్టిన విశాల్.. అతడి పనితీరు నచ్చకపోవడంతో తనే దర్శకత్వ బాధ్యతలు అందుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఐతే మేకింగ్ ఆలస్యం కావడం, ప్రోమోలు పేలవంగా ఉండడంతో ఈ సినిమాకు రిలీజ్ ముంగిట కనీస బజ్ కూడా లేకపోయింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ మినిమం కూడా లేకపోయాయి. పెద్ద యాక్షన్ హీరోగా పేరున్న విశాల్ సినిమాకు తొలి రోజు కోటి రూపాయల వసూళ్లు కూడా రాని పరిస్థితి.

వీకెండ్ మొత్తానికి కలిపి వచ్చిన కలెక్షన్ రూ.3 కోట్లే. వారాంతం తర్వాత అయితే సినిమాను నడిపించడానికి ఎదురు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. మినిమం ఆక్యుపెన్సీలు కూాడా లేక షోలు క్యాన్సిల్ చేసేస్తున్నారు. కొత్తగా యాడ్ అవుతున్న గ్రాస్ ఏమీ లేక ‘మకుటం’ రూ.3 కోట్ల మార్కు దగ్గరే ఆగిపోయిన పరిస్థితి. విశాల్ సినిమాకు మరీ ఇంత దారుణమైన కలెక్షన్ వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. దర్శకుడిగా తన తొలి చిత్రం విశాల్‌కు ఘోర పరాభవాన్నే మిగిల్చింది. బహుశా కెరీర్లో విశాల్ ఇదే అత్యంత పతనం అని చెప్పొచ్చు.

Post a Comment

Previous Post Next Post

Contact Form