విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని టీవీకే నేతల డిమాండ్.. కాంగ్రెస్ ఏమందంటే?

తమిళ హీరో విజయ్‌ సినిమాల్లోనే కాకుండా ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విజయ్‌ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. పార్టీ ప్రారంభించిన తర్వాత విజయ్‌కు ప్రజల్లో, ముఖ్యంగా యువతలో మంచి స్పందన వస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌ గురించి చర్చ ఎక్కువైంది.ఈ మధ్య టీవీకే నాయకులు చెసిన కోన్ని ప్రకటనలు హాట్ టాపిక్ గా మారాయి తమిళనాడు ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాల కారణంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో సీఎం విజయ్ ప్రజాదరణ పెరిగిందని అఖిల భారత స్థాయిలో జాతీయ నాయకుడిగా ఎదిగే సత్తా విజయ్‌కు ఉందని విజయ్ ని ప్రధాని అభ్యర్థి గా ప్రకటించాలని టీవీకే ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు ప్రకటనలు చెశారు

vijay thalapathi PM News

టీవీకే నాయకులు చేసిన ప్రకటనలను కొట్టిపారేసింది కాంగ్రెస్ తమ తొలి ఎన్నికల్లో సాధించిన బలమైన పనితీరును, విజయ్‌కు ఉన్న భారీ అభిమాన గణాన్ని టీవీకే సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని అయితే 2029కి రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని సూచించారు. టీవీకే ఇప్పటికీ ఓ అభిమాన సంఘంలాగే వ్యవహరిస్తోందని ప్రధానమంత్రి పదవిని చేరుకోవడానికి కేవలం కలలు కనడం సరిపోదని.. ప్రజల మద్దతు, ఓట్లు అవసరమని వారు తెలిపారు. ఇలాంటి డిమాండ్లు చేయడం మాని, బీజేపీని, దాని విభజనవాద ఎజెండాను ఎదుర్కోవడంపై టీవీకే దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు.

ప్రస్తుతం విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే విషయం అధికారిక నిర్ణయం కంటే రాజకీయ చర్చగానే కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో టీవీకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? విజయ్‌ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Post a Comment

Previous Post Next Post

Contact Form