మహారాష్ట్రలో జరిగిన ఓ విషాద ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. iPhone కొనుగోలు, EMI చెల్లింపుల విషయంలో కుటుంబంలో జరిగిన వివాదం చివరకు తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో ఓ యువకుడితో పాటు అతని తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు iPhone కొనమని తన తండ్రిని అడిగాడు అంత డబ్బు నా దగ్గరలేదు తర్వత కొంటను అన్నారు అయిన సరే వినకుండా EMI ద్వారా iPhone తిసుకున్నాడు.EMI కట్టమని అడిగాడు EMI ఎక్కువ ఉండడం తో నా దగ్గర ఎంతలెదు నేను కట్టలెను అనడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి సమీపంలోని కొండ ప్రాంతానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు.
యువకుడు అంచు వద్దకు ప్రమాదకరమైన ప్రదేశంలో ఉండటంతో అతన్ని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రయత్నించారు. కొంతసేపు అతనితో మాట్లాడి కిందకు రావాలని నచ్చజెప్పడానికి ప్రయత్నం చెశారు ఎంతమంది చెప్పిన వినకపొవడంతొ యువకుడిని కాపాడే ప్రయత్నంలో అతని తండ్రి కొండ అంచు వద్దకు వెళ్లిన సమయంలో ఇద్దరూ అదుపుతప్పి కింద పడిపోవడంతొ ఈ ఘటనను చూసిన తల్లి కూడా వారిని కాపాడేందుకు ప్రయత్నించడంతో ఆమె కుడా కొండ మిద నుండి దూకెసింది. ఈ ఘటనలో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.
ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఘటనపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తమ ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు
