ధోనీలో నాకు నచ్చిన గొప్ప లక్షణం ఇదే.. 2011 వరల్డ్‌కప్ ఫైనల్‌పై కులశేఖర ప్రశంసలు

భారత క్రికెట్ చరిత్రలో 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఇప్పటికి ఎవరు మరచిపోలెరు అందులోను మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్‌ అయితె ఇంకా!

Ms Dhoni World cup winning six

శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ నువాన్ కులశేఖర, తాజాగా ఆ ఫైనల్ మ్యాచ్‌తో పాటు ధోనీ వ్యక్తిత్వం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టుకు ధోనీతో కలిసి ఆడినప్పటికీ, ఆ సిక్స్ గురించి ధోనీ తనతో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని కులశేఖర వెల్లడించాడు.

ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటాడు. గతాన్ని పట్టించుకోకుండా ఎప్పుడూ వర్తమానంపైనే దృష్టి పెడతాడు. రాబోయే మ్యాచ్ గెలవడంపైనే అతని ఏకాగ్రత ఉంటుంది.అతనిలో నాకు బాగా నచ్చిన లక్షణం ఇదే" అని కులశేఖర ప్రశంసించాడు.

ఆ సిక్స్ గురించి కులశేఖర మాట్లాడుతూ.. "క్రికెట్‌లో ఇలాంటివి సహజమే ధోనీని ఔట్ చేయడానికి నేను నా వంతు ప్రయత్నం చేశాను. కానీ, అతను సిక్స్ కొట్టాడు.

ప్రపంచకప్ ముగిసిన వెంటనే నేను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాను. కానీ, ధోనీ ఎప్పుడూ ఆ ఫైనల్ గురించి మాట్లాడలేదు దిని బట్టి చుసుకుంటె ధోని గతం గురించి ఆలోచన చెయ్యడు ఇప్పుడు తన టిమ్ కి విజయాన్ని అందజెయ్యడానికె ఆలోచన చెస్తాడగని అన్నారు

Post a Comment

Previous Post Next Post

Contact Form