శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడిన సమయంలో బంతిని ఆపేందుకు శ్రీలంక బౌలర్ కేశవ ప్రయత్నించాడు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్‌కు బౌలర్ తగలడంతో అతను బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయాడు.దీంతో పరుగు పూర్తి చేయలేకపోయిన యశస్వి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ ఘటనపై తాజాగా యశస్వి జైస్వాల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారీ స్కోర్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగినట్లు యశస్వి జైస్వాల్ తెలిపారు. మంచి ఇన్నింగ్స్ ఆడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, అయితే దురదృష్టవశాత్తూ అనూహ్యంగా రనౌట్ కావాల్సి వచ్చిందని చెప్పారు. రనౌట్ కావడం తనను కొంత నిరాశకు గురిచేసిందని యశస్వి పేర్కొన్నారు.
బౌలర్ ఎండ్ దగ్గర తాను కింద పడ్డ సంఘటనను చూసి కూడా.. కేఎల్ రాహుల్ పరుగు కోసం రావడం దారుణమని యశస్వి జైస్వాల్ పేర్కొన్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. రాహుల్ సెల్ఫిష్ నెస్ కారణంగానే తాను 32 పరుగులకే వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చిందని వివరించారు. కే ఎల్ రాహుల్ రనౌట్ కావాల్సి ఉండగా, తాను బలి అయినట్లు వివరించారు. అయితే ఈ సంఘటనలో శ్రీలంక ప్లేయర్లు కూడా కాస్త జాలి గుండెతో స్పందించి ఉంటే బాగుండేది అన్నారు. తాను లంక క్రికెటర్ కారణంగానే కింద పడ్డ విషయాన్ని గ్రహించకుండా కెప్టెన్ ధనుంజయ డీ సిల్వా క్రూరంగా బిహేవ్ చేశాడని ఆగ్రహించారు. ఇలా అందరి వల్ల తన వికెట్ కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారట. అయితే యశస్వి జైస్వాల్ ఈ కామెంట్స్ చేశాడో లేదో కానీ.. సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతుంది.
