వెంకటేష్ దసరా ధమాకా.. ‘AK47’ నుంచి అదిరిపోయే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది!

Modern News Ticker with Links

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)’పై మరో బిగ్ సర్‌ప్రైజ్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

Adarsha Kutumbam House No 47: Nara Rohit First Look Poster Out | Venkatesh, Trivikram

తాజాగా ఈ క్రేజీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవర్‌ఫుల్ నటుడు నారా రోహిత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

నారా రోహిత్ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుతానికి రహస్యంగా ఉంచినప్పటికీ, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. పోస్టర్‌లో రోహిత్ సిగరెట్ కాలుస్తూ, సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన వెనుక ‘POLICE’ అని రాసి ఉన్న బోర్డ్ స్పష్టంగా కనిపిస్తుండటంతో, ఈ సినిమాలో ఆయన ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని అభిమానులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉండగా, ఇప్పుడు నారా రోహిత్ ఎంట్రీతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఆయన పాత్ర కథలో కీలక మలుపు తీసుకురానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)’ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ దసరాకు విక్టరీ వెంకటేష్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Ravindra G

Ravindra G

✓ Verified
SEO Content Writer & Webdesigner

మేము ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా వార్తలు, అన్ని ప్రభుత్వ ఉద్యోగలకు సంబంధించిన పుస్తకాలు న్యూస్ తాజా అప్‌డేట్లను ఆధారంగా పరిశీలించి, నమ్మదగిన, ఖచ్చితమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడం మా లక్ష్యం. News

Post a Comment

Previous Post Next Post

Contact Form