పాకిస్తాన్ కి ఇండియా మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. పాకిస్తాన్ సరిహద్దు నుంచి ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఘటన తర్వాత వరల్డ్ కప్, ఆసియా కప్ వంటి టోర్నమెంట్లలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు తప్పా ఏ మ్యాచ్ లు ఆడబోమని భారత్ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును, పాకిస్తాన్ క్రికెట్ బోర్డును అంతర్జాతీయ స్థాయిలో చులకనగా చూస్తున్నారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) ఇటీవల టీమిండియా, బీసీసీఐపై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ వాళ్లకు అహంకారం పెరిగిందని కూడా వ్యాఖ్యానించారు.
ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్న జై షా కూడా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని అఫ్రిది ఆరోపించారు. ప్రతి విషయంలోనూ పాకిస్తాన్‌ను చిన్నచూపు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పాకిస్తాన్ క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై భారత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్‌ను బలహీనపరిచే విధంగా బీసీసీఐ కూడా చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు.
అందుకే పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)కు పోటీగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) షెడ్యూల్‌ను బీసీసీఐ ఉద్దేశపూర్వకంగా విడుదల చేస్తూ పాకిస్తాన్ క్రికెట్‌కు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తోందని షాహిద్ అఫ్రిది పేర్కొన్నారు.
