వైరల్ అవుతున్న వరుణ్ చక్రవర్తి వివాదం వివరణ కోరిన బీసీసీఐ

ఐపిఎల్ 2026 ప్లే ఆఫ్ చెరడానికి గట్టిగానే పోటీ పడుతున్న ఈ తరుణంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను లెక్కచేయకుండా ఆడిస్తున్నారు. ముఖ్యంగా మే 16, శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన KKR vs GT మ్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో KKR 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మేనేజ్‌మెంట్ చేసిన పనిపై బీసీసీఐ తీవ్రంగా స్పందిస్తోంది. అసలు ఏం జరిగిందంటే, టీమ్ ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయంతో బాధపడుతున్నప్పటికీ ఆయనతో బౌలింగ్ చేయించడం వివాదానికి దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతుండగా, బీసీసీఐ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

వరుణ్ చక్రవర్తి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన టాప్ క్లాస్ బౌలర్. అలాంటి ఆటగాడి ఫిట్‌నెస్‌ను నిర్లక్ష్యం చేయడం పట్ల తీవ్రంగా ఖండించింది. ఆటగాళ్ల ఆరోగ్యం కంటే మ్యాచ్ ఫలితాన్ని ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని సూచించింది.

ఈ ఘటనపై బీసీసీఐ PTI చట్టం ప్రకారం కేకేఆర్ మేనేజ్‌మెంట్‌ను వివరణ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేకేఆర్ జట్టులో బౌలర్ల కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్ ప్రారంభం నుంచే పలువురు బౌలర్లు గాయపడటం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది.

ఇదిలా ఉండగా, తర్వాత మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి ఆడతాడా లేదా అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.

Post a Comment

Previous Post Next Post

Contact Form