రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఆర్టీసీ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC / PTD) ద్వారా సరికొత్త పర్యాటక సేవలను అందుబాటులోకి తేనున్నారు.

ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) తరహాలోనే, ప్రభుత్వ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (PTD) ఆధ్వర్యంలో ‘ఏపీ పీటీడీ టూరిజం’ (AP PTD Tourism) సేవలు త్వరలోనే అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు తిరుపతి జిల్లాతోపాటు పొరుగు జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, విశేష సందర్శక ప్రాంతాలు, కేంద్రాలను గుర్తించి రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు.

Day Travel (🚌) Places to Visit (🛕 / 🌄)
Day 1 🚌 Kadapa Local Travel 🛕 గండికోట
🛕 ఒంటిమిట్ట రామాలయం
🛕 నందలూరు సౌమ్యనాథ ఆలయం
🛕 పుష్పగిరి ఆలయాలు
Day 2 🚌 Kadapa → Tirupati 🛕 కపిలతీర్థం
🌄 సైన్స్ సెంటర్
🐾 జూపార్క్
🛕 శ్రీనివాసమంగాపురం
🏰 చంద్రగిరి కోట
🛕 వకుళమాత
🛕 ముక్కోటి
🛕 తిరుచానూరు
Day 3 🚌 Tirupati Surroundings 🛕 అప్పలాయగుంట
🛕 నారాయణవనం
🛕 నాగలాపురం
🛕 సురుటుపల్లె
🛕 కార్వేటినగరం
Day 4 🚌 Tirupati → Srikalahasti 🛕 గుడిమల్లం
🛕 తొండమనాడు
🛕 శ్రీకాళహస్తి
Day 5 🚌 Srikalahasti → Vakadu 🌊 తూపిలిపాళెం బీచ్
🚀 షార్ (SHAR)
🌅 పులికాట్ సరస్సు
Day 6 🚌 Return / Local Travel 🛕 మాధవమాల
🎨 కలంకారి
🛕 శ్రీకాళహస్తి ఆలయం

అంతేకాదు, పర్యాటకులలో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఆయా దేవాలయాల విశిష్టత, సందర్శక ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ పెద్ద పెద్ద సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రిలీజియస్‌ మరియు పిలిగ్రిమేజ్‌తో పాటు ఎకో, హెరిటేజ్ టూరిజంగా విభజించారు. దీనికి సంబంధించిన బస్సులు ఎప్పుడు, ఏ రూట్లలో నడపాలన్న అంశాలపై చర్చించారు. చార్జీలు, టిక్కెట్ బుకింగ్‌, సిబ్బంది కేటాయింపులపై కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇలా తిరుపతి కేంద్రంగా నలుదిశలా ఆర్టీసీ ఆధ్వర్యంలో టూరిజం అభివృద్ధికి సన్నాహాలు జరుగుతున్నాయి.

🔑 Focus Keywords:
AP PTD Tourism, APSRTC Tourism, Andhra Pradesh Tourism, Tirupati Tourism Packages

🏷️ Tags:
AP Tourism, APSRTC, Tirupati Travel, Tourism Packages, Eco Tourism

Post a Comment

Previous Post Next Post

Contact Form