చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ - టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..!!

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో నెమ్మదించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గత రెండు మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకుతున్న ధోనీ సేనకు, ప్రధాన పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం రూపంలో పెద్ద షాక్ తగిలింది.

Khaleel Ahmed injury update IPL 2026 CSK shock news


సీజన్ ప్రారంభంలో వరుసగా మూడు ఓటములను చవిచూసిన CSK, జట్టులో మార్పులు చేసి మళ్ళీ విజయపథంలోకి వచ్చింది. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లలో ఖలీల్ అహ్మద్ వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, తాజాగా అతనికి క్వాడ్రిసెప్స్ (Quadriceps) గాయం కావడంతో, ఈ సీజన్ మొత్తానికి అతను దూరం కావడం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో చెన్నై 32 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, ఆ మ్యాచ్‌లోనే ఖలీల్‌కు గాయమైంది. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేస్తున్న సమయంలో తన కుడి తుంటి భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో, కేవలం ఐదు బంతులు మాత్రమే వేసి ఖలీల్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. మిగిలిన ఒక బంతిని గుర్జప్‌నీత్ సింగ్ పూర్తి చేశాడు.

ఖలీల్ కోలుకోవడానికి కనీసం 10 నుండి 12 వారాల సమయం పడుతుంది"అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ సీజన్‌లో ఖలీల్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 2 వికెట్లు తీసినప్పటికీ, 8.67 ఎకానమీతో చెన్నై బౌలర్లలో రెండో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా కొత్త బంతితో స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో ఆయనది కీలక పాత్ర.

Post a Comment

Previous Post Next Post

Contact Form