SSC Exams: పదొవ పరీక్షలకు దూరమైన యువ హిట్టర్ వైభవ్.. కారణం ఇదే

టీమిండియా అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది నిర్వహించే సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు హాజరుకావడం లేదని సమాచారం వెలువడింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వైభవ్ తండ్రి ఇటీవల వెల్లడించారు.

Team India U19 star Vaibhav Suryavanshi exam update news image

భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తోన్న యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavamsi) క్రికెట్ శిక్షణ, రాబోయే టోర్నీలపై పూర్తిగా దృష్టిసారించాలనే కారణంతో ఈ ఏడాది జరగనున్న సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.

వైభవ్ బోర్డు ఎగ్జామ్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. సదరు పాఠశాల డైరెక్టర్ ఎ.కె. పింటూ మాట్లాడుతూ, “వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు హాజరుకాకూడదని తీసుకున్న నిర్ణయం పూర్తిగా కుటుంబంతో చర్చించిన తరువాతే తీసుకున్నది. ముఖ్యంగా అతని తండ్రితో విస్తృతంగా మాట్లాడిన తరువాతే ఈ నిర్ణయానికి వచ్చాడు,” అని వెల్లడించారు.

ప్రస్తుతం వైభవ్ ఫోకస్ అంతా క్రికెట్ పైనే ఉంది. అందుకే ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు వైభవ్ హాజరవడం లేదు. వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తాడు' అని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post

Contact Form