IND W vs SA W Final: సిక్సుల మొతా మొగించావ్ గా అక్క .. ఉమెన్స్ టీమ్ ధోని నువ్వే !

 IND W vs SA W ఫైనల్: 2025 మహిళల వన్డే ప్రపంచకప్ భారత క్రికెట్ అభిమానులను ఊహించని ఉత్సాహంలో ముంచేస్తోంది. మన ఉమెన్స్ టీమ్ మెన్స్‌ లాగా ధైర్యంగా, చురకగా పోటీ పడుతోంది. కానీ ఈ మ్యాచ్‌లో ఒక ప్లేయర్ తన అద్భుత ప్రదర్శనతో హీటు పెంచింది. ఒక్కొక్క బాల్‌లో ఉత్కంఠ పెంచుతూ, భారీ సిక్సులు కొడుతూ ఫ్యాన్స్‌ను మంత్రిపోతున్నది ఆమె ఆట.






అలాగే సౌతాఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో (ind vs sa odi world cup final match) సైతం రిచా రెండు సిక్సులు బాదింది. ఐతే, ఆమె కొట్టే సిక్సులు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. మామూలుగా అయితే మహిళా ప్లేయర్లు కొట్టే సిక్సులు బౌండరీ లైన్ దాటుతాయి. కానీ రిచా ఘోష్l కొట్టే సిక్సులు ఆడియన్స్ మధ్య పడతాయి. ఆమె క్రీజులో నించొనే సిక్సులు కొట్టే సత్తా ఉంది. ఇక 2025 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సీజన్ లో ఒక పవర్ హిట్టర్‌గా పేరు తెచ్చుకుంది రిచా.









ఫ్యాన్స్ ఆమెను “మరో ధోని” అని, “మరొక పాండ్యా” అని పోలుస్తూ, సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు మరియు MEMEs తో మెరిసిపోతున్నారు. కొన్ని గంటల్లోనే ఆమె కోణంలో ఒక స్టార్ అవతారంగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా, ఆమె ఆట, ఆత్మవిశ్వాసం, ఫినిషింగ్ స్కిల్స్ గురించి చర్చ జరుగుతోంది.



మనలో చాలామందికి “సిక్సులు అంటే కేవలం మగవాళ్లు మాత్రమే కొట్టగలరు” అనే ఆలోచన ఉంటుంది. క్రికెట్‌లో కూడా ఎక్కువగా మెన్స్ మ్యాచ్‌లే చూసే పద్ధతి ఉంది. కానీ నిజానికి, మహిళల క్రికెట్ కూడా ఇప్పుడు భిన్నంగా మారింది. భారత మహిళల క్రికెట్ టీమ్ శక్తివంతమైన ప్రదర్శనతో ప్రపంచంలో గుర్తింపు పొందుతోంది.

Website Popup Message

Post a Comment

Previous Post Next Post

Contact Form