వాస్తు రహస్యాలు: నిమ్మ చెట్టు ఎక్కడ నాటితే అదృష్టం కలుగుతుంది

మనలో చాలా మంది తమ ఇళ్ల ఆవరణలో పూల మొక్కలు, కూరగాయల మొక్కలతో పాటు పెద్ద చెట్లు కూడా నాటుతుంటారు. వేప చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు, సపోటా చెట్టు వంటి వాటితో పాటు నిమ్మ చెట్టును కూడా చాలామంది ఇష్టంగా పెంచుతారు. నిమ్మ చెట్టు చిన్నదైనా, పచ్చగా, పుష్పాలతో, ఫలాలతో నిండుగా ఉంటే ఇంటికి ఎంతో అందాన్ని తెస్తుంది. అంతేకాదు, దాని ఆకులు, పువ్వులు, ఫలాలు అన్నీ మన జీవితంలో ఉపయోగపడేవే అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నిమ్మ చెట్టు పెంచడం శుభమా? అశుభమా? అన్నదానిపై చాలామందికి సందేహం ఉంటుంది.

ప్రధానంగా పండ్ల చెట్లు, పూల మొక్కలు, మనీ ప్లాంట్‌, తులసి చెట్టు వంటివి ఉంటాయి. అయితే ఇంటి ఆవరణలో చెట్లు, మొక్కలు ఉండటం వల్ల పూలు, పండ్లతో పాటు స్వచ్ఛమైన గాలి, మానసిక ప్రశాంత కూడా లభిస్తుంది. అయితే చాలా మంది ఇళ్లలో ముఖ్యంగా పల్లెటూర్లలో నిమ్మ చెట్టు కూడా ఉంటుంది.

Telegram Join Banner

వాస్తు ప్రకారం నిమ్మ చెట్టు లక్ష్మీ దేవికి ప్రీతికరమైన చెట్టుగా కూడా పరిగణించబడుతుంది. అందుకే నిమ్మ చెట్టు పక్కన దీపం వెలిగించడం లేదా పూజల సమయంలో నిమ్మకాయను ఉపయోగించడం ఆర్థిక శ్రేయస్సును పెంచుతుందని చెబుతారు.

నిమ్మ చెట్టుకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి మరియు ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కేవలం ఒక మొక్క కాదు, సానుకూల శక్తిని (Positive Energy) పెంచే ఒక సహజ శక్తి కేంద్రంగా పరిగణించబడుతుంది. నిమ్మ చెట్టు చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడూ చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది.

Ad Banner

ఈ చెట్టు ఇంట్లో పెంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ఆనందం, ఆరోగ్యం పెరుగుతాయని నమ్మకం. నిమ్మ చెట్టు నుండి వచ్చే సువాసన వాతావరణంలోని వైరస్‌లు, దోమలు, చెడు వాసనలను తగ్గిస్తుంది. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉండి, ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది.

Ad Banner Ad Banner

అలాగే, నిమ్మ చెట్టును తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం వల్ల ఉదయసూర్యుని కాంతి చెట్టుపై పడుతుంది. అది ఇంటికి సహజ శక్తిని తెచ్చి, చెడు శక్తులను దూరం చేస్తుంది. కానీ నిపుణుల హెచ్చరిక ప్రకారం, నిమ్మ చెట్టును ఇంటి మధ్యలో లేదా ప్రధాన ద్వారం ముందు నాటకూడదు. అలా చేస్తే ఆ ఇంట్లో మనస్పర్థలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిమ్మ చెట్టు మీద ఎండిన ఆకులు లేదా కొమ్మలు ఉండకూడదు. అవి చెడు శక్తిని ఆకర్షిస్తాయని భావిస్తారు. చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా, సజీవంగా ఉంటే, అది ఇంటికి శుభఫలితాలు, శాంతి, ఆనందం తెస్తుంది

🌿 Lemon Tree Tags 🌿

Click any tag to explore more 🍋

Post a Comment

Previous Post Next Post

Contact Form