మార్కెట్ రిస్క్ లేని నమ్మకమైన బీమా ప్లాన్ – బీమా లక్ష్మీతో మీ కలలు నిజం చేసుకోండి!

 భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఇటీవల కొత్త పాలసీ “బీమా లక్ష్మీ” ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా సాధారణ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, తక్కువ పొదుపుతో ఎక్కువ లాభం పొందే అవకాశం లభిస్తోంది. రోజుకు కేవలం రూ.125 సేవ్ చేస్తే, పాలసీ గడువు ముగిసే సమయానికి రూ.10 లక్షల వరకు పొందే అవకాశం ఉంది.ఈ పథకం ఒకేసారి భద్రతా రక్షణ మరియు పెట్టుబడి ప్రయోజనాలు రెండింటినీ అందిస్తుంది. పాలసీ కాలంలో ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. అలాగే పాలసీ మేచ్యూరిటీకి చేరినప్పుడు మొత్తం డబ్బును ఒకేసారి పొందవచ్చు.


ఈ ఎల్ఐసీ “బీమా లక్ష్మీ” పథకం ఒక నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్, అంటే మార్కెట్ ఒడిదుడుకులతో దీంట్లో ఎలాంటి సంబంధం ఉండదు. అంటే, స్టాక్ మార్కెట్ పెరుగుదలలు లేదా పడిపోవడాలు ఈ పాలసీ రిటర్న్స్‌పై ఎలాంటి ప్రభావం చూపవు. ఇది పూర్తిగా సురక్షితమైన మరియు స్థిరమైన పెట్టుబడి అవకాశం.ఈ ప్లాన్‌లో కంపెనీ లాభాల్లో పాలసీదారులకు ఎలాంటి భాగస్వామ్యం ఉండదు — అందువల్ల బోనస్ చెల్లింపులు ఉండవు. కానీ, దీని ప్రత్యేకత ఏమిటంటే, కేవలం బేస్ ప్లాన్ ద్వారానే పాలసీ ముగిసే సమయానికి ఒకేసారి రూ.8 లక్షలు వరకు పొందే అవకాశం ఉంటుంది.







మరి ఈ లాభం పొందాలంటే ఏం చేయాలి?

ముందుగా, ఎల్ఐసీ బీమా లక్ష్మీ పథకానికి దరఖాస్తు చేయాలి.

మీకు సరిపోయే పాలసీ గడువు (ఉదా: 15 లేదా 20 సంవత్సరాలు) ఎంచుకోవాలి.

రోజువారీ, నెలవారీ లేదా వార్షిక ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌లో మీకు అనుకూలమైనది తీసుకోవచ్చు.

పాలసీ గడువు ముగిసిన తర్వాత మొత్తం మొత్తాన్ని ఒకేసారి పొందవచ్చు.








ఇతర ప్రయోజనాలు:

ట్యాక్స్ బెనిఫిట్స్: ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 80C మరియు 10(10D) కింద పన్ను రాయితీలు లభిస్తాయి.

లోన్ సదుపాయం: కొంత కాలం ప్రీమియం చెల్లించిన తర్వాత పాలసీపై లోన్ సదుపాయం కూడా పొందవచ్చు.

నామినీ సదుపాయం: పాలసీదారు అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో నామినీకి ఆర్థిక భద్రత లభిస్తుంది.

సులభమైన చెల్లింపు పద్ధతులు: ఆన్‌లైన్, యూపీఐ, లేదా ఎల్ఐసీ కౌంటర్‌లో నేరుగా చెల్లించే సౌకర్యం.

Website Popup Message

Post a Comment

Previous Post Next Post

Contact Form