మీ జుట్టు తక్కువ సమయంలోనే పొడవుగా, దట్టంగా, మెరిసేలా మారాలని అనుకుంటున్నారా? అయితే, మీ వంటగదిలోనే లభించే రెండు అద్భుతమైన పదార్థాలు — మెంతులు మరియు ఉల్లిపాయ — చాలు! అందమైన, దట్టమైన జుట్టు పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడు వాతావరణ మార్పులు, కాలుష్యం, ఒత్తిడి, అసమతుల ఆహారం వంటి కారణాల వల్ల చాలా మంది జుట్టు రాలిపోవడం, పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జుట్టు కుప్పలు తెప్పలుగా ఊడిపోతోంది. ఎన్నో రకాల షాంపూలు, ఆయిల్స్, మందులు వాడినా లేదా ఖరీదైన ట్రీట్మెంట్లు తీసుకున్నా — జుట్టు రాలడం కొంతవరకు తగ్గుతుందేమో కానీ, మునుపటి లాగా దట్టంగా, బలంగా పెరగడం చాలా మందికి సాధ్యం కావడం లేదు.
జుట్టు వేగంగా, దట్టంగా పెరగడానికి మెంతులు మరియు ఉల్లిపాయలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రెండింటిలోనూ జుట్టు పెరుగుదల కోసం అవసరమైన సహజ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
హెయిర్ ప్యాక్ తయారు చేయాలంటే ముందుగా రాత్రిపూట మెంతులను నీళ్లలో నానబెట్టాలి. మరుసటి రోజు ఆ మెంతుల్లో ఉల్లిపాయను తొక్కతీసి ముక్కలు వేసి, ఈ రెండింటినీ మెత్తగా పేస్ట్‌లా రుబ్బుకోవాలి.
తయారైన ఈ మిశ్రమాన్ని తల చర్మం మరియు జుట్టు రూట్లపై బాగా పట్టించి, సున్నితంగా మసాజ్ చేయాలి. దాన్ని సుమారు 30 నిమిషాల పాటు ఉంచిన తర్వాత, తేలికపాటి సల్ఫేట్-ఫ్రీ షాంపూతో తలస్నానం చేయండి.
ఈ పద్ధతిని వారంలో 2 సార్లు పాటిస్తే, కొద్ది రోజుల్లోనే మీ జుట్టు బలంగా, మెరిసేలా మరియు వేగంగా పెరుగుతుందని గమనిస్తారు.
