గురువారం బంగాళాఖాతం లో తుఫాన్ గమనాన్ని పరిశీలించినప్పుడు తుఫాన్ ప్రభావం చాలావరకు తగ్గిందని అని చెప్పుకోవచ్చు గత కొద్ది రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన తుఫాన్ ముఖ్యంగా రొయ్యలు, వరి పండించే రైతులు ఆందోళన చెందారు
గురువారం వాతావరణ శాఖ వారు విడుదల చేసిన బుల్లెట్ల ప్రకారం తుఫాన్ యొక్క తీవ్రత చాలావరకు తగ్గిందని అనిపిస్తుంది వాతావరణ శాఖ వారు చెప్పిన దాని ప్రకారం తుఫాన్ ఉత్తర కోస్తా, దక్షిణా ఒడిస్సా మధ్య దాటే అవకాశం ఉండడంతో తుఫాన్ ప్రభావం అంతగా ఉండదని చెప్తున్నారు కానీ శుక్ర శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అక్కడక్కడ భారీ వర్షాలతో కూడిన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అంటున్నారు
