ఎస్ ఆర్ హెచ్ స్టార్ ప్లేయర్ వచ్చేసాడు..

 వచ్చే ఐపిఎల్ కు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆడతారా లేదా అనేది క్రికెట్ అభిమానులందరిలో ఒక ప్రశ్నగా మారింది ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ మరియు కెప్టెన్ ఆడతాడా లేదా అనే సందేహాలు బాగా వినిపిస్తున్నాయి అయితే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ ఈ విషయంపై ఫుల్ గా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆస్ట్రేలియా ప్లేయర్లు గతం లాగానే ఈ సీజన్ కూడా ఆడతారని తేల్చి చెప్పింది ఈ విషయం బయటకు రావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కత నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట లభించింది

SRH Star Player Arrives – Sunrisers Hyderabad Cricket Team Update


ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఫాస్ట్ బౌలర్లు పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, కామెరాన్ గ్రీన్ రాబోయే టోర్నీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాత్రం ఈ సీజన్ ఆడకపోవచ్చు.డిసెంబర్ 16న గోవా వేదికగా మినీ వేలం జరగనున్న నేపథ్యంలో, ఈ ఇద్దరు సీనియర్ అంతర్జాతీయ ఆటగాళ్లు లభ్యత గురించి స్వస్థత లభించింది ఆ ఇద్దరిలో కమింగ్ కచ్చితంగా ఆడే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి అయితే పోయిన సీజన్కమిన్స్ వెన్నునొప్పితో బాధపడ్డ విషయం తెలిసిందే. దాని నుంచి కోలుకున్న తర్వాత ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ సమయంలో ఇషాన్ కిషన్ తాత్కాలికంగా జట్టును నడిపించారు.


కెప్టెన్ పాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 18 కోట్లకు నిలుపుకొన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ సీజన్ మొదటి కొన్ని మ్యాచ్లలో తనకి విశ్రాంతి ఇవ్వాలని ఎస్ ఆర్ హెచ్ మేనేజ్మెంట్ అనుకుంటే బౌలింగ్ కొంచెం వీక్ గా కనిపించే అవకాశం కనిపిస్తుంది దీనికోసం మంచి ప్లాన్ అయితే ఎస్ ఆర్ హెచ్ అమలు చేసిందని చెప్పుకోవచ్చు ప్లేయర్ ట్రేడింగ్ ప్రక్రియ ద్వారా ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, టీ నటరాజన్ ను జట్టులోకి తీసుకుంది. దీని వల్ల కమిన్స్ లేని సమయంలో కూడా జట్టు పేస్ బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంటుంది.

Post a Comment

Previous Post Next Post