కాకినాడ జిల్లా పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కొణిదెల ఉపాసన గారు మహిళల ఆరోగ్యం మరియు పిల్లల ఆరోగ్యమే లక్ష్యంగా అందరికీ వైద్య సౌకర్యాలు అందించడానికి అపోలో హాస్పటల్ ద్వారా అపోలో ఆరంభ అనే కార్యక్రమం ద్వారా మోడల్ అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు ఈ మోడల్ అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించడానికి మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గారు మరియు కొణిదల ఉపాసన గారు ఈ మోడల్ అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి మాట్లాడుతూ మనదేశంలో 1.4 బిలియన్ల ప్రజలు ఉన్నారని అందులో దాదాపు 13 కోట్ల మంది పైగా ఆరు సంవత్సరాలు కరిగిన పిల్లలు ఉన్నారని ఈ పిల్లలే మన రేపటి భారతదేశానికి కీలక మన్నారు వాళ్ల భవిష్యత్తును మెరుగుపరచడానికి మన వంతు ప్రయత్నం చెయ్యాలి అని ఆమె అన్నారు
అందుకే అపోలో ఆరంభ ముందుకు వచ్చిందని ఈ అపోలో ఆరంభ ద్వారా చాలామంది మహిళలు మరియు పిల్లలకు మంచి ఆరోగ్య సదుపాయాలు అందజేస్తామని అంతేకాదు అంగన్వాడి కేంద్రాల పరిధిలో ఉన్న గృహాల్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు గర్భిణీ స్త్రీలకు పండ్లను అందజేయడం మరియు పాలును అందజేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని మరియు అంగన్వాడి అభివృద్ధికి తమ వద్దు కృషి చేయాలని అన్నారు
మొదటిగా ఈ మోడల్ అంగన్వాడి కేంద్రాన్ని పిఠాపురంలోని అగ్రహారంలో నిర్మించారు దీనికి 50 కోట్లు ఖర్చు అయినట్లు చెప్పారు అంతేకాకుండా ఇలాంటి కేంద్రాలను మొత్తం 109 నిర్మిస్తామని ప్రతి కేంద్రంలో ఎల్ఈడి స్క్రీన్ లో మరియు భోజనశాల క్రీడా పరికరాలు చదువుకోడానికి వీలుగా ఉండేలాగా టేబుల్స్ మరియు కుర్చీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు
