కీరన్ పొలార్డ్ కొత్త చరిత్ర.. టీ20ల్లో బట్లర్‌ను అధిగమిస్తాడా?

వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు పోలార్డ్ గురించి మనందరికీ తెలిసిందే వెస్టిండీస్ తరఫున ఎన్నో విజయాలను అందించడంలో కీలక పాత్ర పోషించాడు టి20 ఫార్మేట్ లో తన ఆట గురించి చెప్పను అవసరం లేదు పెద్ద పెద్ద సిక్సర్లు కొట్టడంలో తనకు తానే సాటి ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో కీలకమైన మ్యాచుల్లో మంచి విజయాలు అందజేశాడు రిటైర్మెంట్ తర్వాత వేరువేరు లీగులలో ఆడుతున్నాడు మన పోలార్డ్ నవంబర్‌ 21న దుబాయ్‌ వేదికగా డెజర్ట్‌ వైపర్స్‌తో ఎంఐ ఎమిరేట్స్‌ తలపడింది. ఈ మ్యాచ్‌కు ముందు పొలార్డ్‌ టీ20 పరుగులు 14,999గా ఉన్నాయి. అంటే 15 వేల పరుగులు చెరుకొవడానికి కెవలం ఒక్క పరుగు మాత్రమే దూరం బ్యాటింగ్‌కు దిగిన అతడు తొలి పరుగుతోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 15 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేశాడు. దీంతో అతడి మొత్తం టీ20 పరుగుల సంఖ్య 15,014కు చేరింది. జోస్‌ బట్లర్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు.. ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌ బ్యాటర్‌గా 15 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా మరో ప్రత్యేక రికార్డు అందుకున్నాడు

Kieron Pollard completes 15000 T20 runs, chasing Jos Buttler's record in T20 cricket

కీరన్‌ పొలార్డ్‌ టీ20 క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు T20 ఫార్మాట్‌లో 15 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రెండవ జాబితాలో చేరుకున్నాడు ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో భాగంగా ఎంఐ ఎమిరేట్స్‌ తరఫున ఆడుతున్న కీరన్‌ పొలార్డ్‌ ఈ ఘనత సాధించాడు ఈ జాబితాలో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ మొదటి స్థానంలో ఉండగా.. పొలార్డ్‌ రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పరుగుల తేడా చాలా తక్కువగా ఉంది.

జోస్‌ బట్లర్‌ ని అధిగమించి నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకోవాలంటే మాత్రం మరో 48 పరుగులు చేయాలి పొలార్డ్‌ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం బట్లర్‌ 15,062 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. పొలార్డ్‌ 15,014 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య తేడా కేవలం 48 పరుగులే. నవంబర్‌ 24న గల్ఫ్‌ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో పొలార్డ్‌ 48 పరుగులుచేస్తే తానే నెంబర్ వన్ గా నిలుస్తాడు రాబోయే మ్యాచ్లో పోలార్డ్ ఈ ఘనతను సాధిస్తాడేమో చూడాలి మరి...

Post a Comment

Previous Post Next Post