చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు పెద్ద షాక్

మొన్న జరిగిన చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది 95 లక్షలు జరిమానా తో పాటు ఒక ఏడాది జైలు శిక్షణ కూడా విధిస్తున్నట్టు ఒంగోలు కోర్టు తీర్పు ఇచ్చింది వివరాల్లోకి వెళితే.. బండ్ల గణేష్ రూ.95 లక్షల చెక్కును ఒకరికి అందజేశాడు ఎకౌంట్లో తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో ఆ చెక్ కాస్త బౌన్స్ అయింది దీంతో తనని మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితుడు ఒంగోలు కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు.. బండ్ల గణేష్ కు ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించింది. అలాగే, బాధితుడికి కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలని ఆదేశించింది ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్ కు న్యాయస్థానం నెల రోజుల గడువు ఇచ్చింది.

Post a Comment

Previous Post Next Post