Telangana: తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ (DG) గా విసి సజ్జనార్

తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి ఏకంగా 21 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్రవ్యాప్తంగా బదిలీ చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా విసి సజ్జనర్ కొత్త బాధ్యతలు ఇవ్వబోతున్నట్టు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించింది

VC Sajjanar appointed as Telangana Fire and Disaster Response Emergency and Civil Defence Director General (DG)

2026 నవంబర్ 12 న జిఓ నంబర్ 1654 ప్రకారం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు ఇప్పటివరకు నగర సిపి గా బాధ్యతలు వ్యవహరించిన వీసి సజ్జనార్ తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగంలో డిజీగా నియమించారు దీనితోపాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిజీ బాధ్యతలు అప్పగించారు సజ్జనార్ పోలీస్ సేవలను ప్రజలకు అందజేయడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు ఆయన చేపట్టిన కార్యక్రమం మీట్ యువర్ సిపి కార్యక్రమం ప్రజలలో ఎంతగానో ఆదరణ పొందింది చాలామంది ప్రజలు తమ సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా చెప్పుకున్నారు

మహిళల భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, ఆహార కల్తీపై చర్యలు, సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసింగ్ మెరుగుపరచడంపై కూడా దృష్టి పెట్టారు ఈయన రాకతో ఫైర్ డిపార్ట్మెంట్ లో మంచి మార్పు రాబోతుందని అందరూ అనుకుంటున్నారు

Post a Comment

Previous Post Next Post