ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది అది పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి 15 నాటికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించనుందని పేర్కొంది. ఈ వాయుగుండం బలపడి తమిళనాడు తీరం దిశగా వస్తుందా లెదా వెరే దిశకు వెళ్ళుతుందా అనే విషయం ఇంకా తెలియలెదు
అయితె కొంతమంది నిపుణులు మాత్రం వాయుగుండంగా బలపడిన తర్వాత ఇది దిశ మార్చుకుని బంగ్లాదేశ్, మయన్మార్ వైపు పయనిస్తుందని అంచన వెస్తున్నారు వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలోకి వచ్చే సమయంలో తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. శనివారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
