వినాయక చవితి పండుగను ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. అయితే విగ్రహాల తయారీలో ఉపయోగించే కొన్ని పదార్థాల వల్ల పర్యావరణానికి నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పర్యావరణానికి మేలు చేసే విధంగా వినాయక చవితిని జరుపుకోవాలని మెగాస్టార్ చిరంజీవి సూచించారు.ఈసారి వినాయక చవితి సందర్భంగా అందరూ పర్యావరణహిత వినాయక విగ్రహాలను ఉపయోగించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ముఖ్యంగా సీడ్ గణేశుడిని పూజించాలని ఆయన కోరారు. ప్రకృతిని కాపాడటంతో పాటు పచ్చదనాన్ని పెంచడానికి ఇలాంటి విగ్రహాలు ఉపయోగపడతాయని తెలిపారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను చిరంజీవి ఆదివారం తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్బంగా మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని సీడ్ గణేశుడిని పూజించిన అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే.. అందులోని విత్తనం మొలకెత్తి మొక్కగా ఎదిగి మనల్ని ఆశీర్వదిస్తుందని అన్నారు చిరంజీవి అన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఓ యజ్ఞంలా భావించి కోట్లాది మొక్కలు నాటి ఈ వినాయక చవితిని పచ్చదనంతో రెపటి భవిష్యత్తు కోసం జరుపుకుందాం అని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయని అందుకే ఈ సారి సీడ్ గణేశుడిని ఆరాధించడం ద్వారా అటు పుణ్యం.. ఇటు పురుషార్థం.. అంటే ప్రకృతిని కాపాడే బాధ్యత దక్కుతుంది’’ అని చిరంజీవి అన్నారు
సీడ్ గణేశుడి ద్వారా భక్తి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లవచ్చని చిరంజీవి సందేశం ఇచ్చారు. ప్రతి ఇంట్లో ఒక సీడ్ గణేశుడిని పూజించి, ఆ తర్వాత వచ్చే మొక్కను పెంచితే భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వినాయక చవితిని ప్రకృతిని కాపాడే పండుగగా జరుపుకోవాలని ఆయన కోరారు.
