AP EAPCET 2026 Results:30న ఈఏపీసెట్ ఫలితాలు..

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఫలితాలను ఈ నెల 30న విడుదల చేసేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

వాస్తవానికి ఈ పరీక్ష ఫలితాలు ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరియు సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి ఫలితాల విడుదలలో ఆలస్యం కావడంతో ఈఏపీసెట్ ఫలితాలు కూడా వాయిదా పడ్డాయి.

ఈఏపీసెట్ ర్యాంకుల నిర్ణయంలో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ ఉండటంతో, ఇంటర్ ఫలితాలు అందుబాటులోకి వచ్చిన తర్వాతే ర్యాంకుల ప్రక్రియను పూర్తి చేయాల్సి వచ్చింది. దీంతో ఫలితాల విడుదల ఆలస్యమైంది.

అదేవిధంగా, సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వెరిఫికేషన్ తర్వాత మార్కులు పెరిగిన విద్యార్థులు తమ డిక్లరేషన్ ఫారమ్‌ను ఈ నెల 27 సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఈఏపీసెట్ కన్వీనర్ సూచించారు. అనంతరం తుది ఫలితాలను జూన్ 30న విడుదల చేయనున్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post

Contact Form