RRB Group D Result 2026: మీ రోల్ నంబర్ ఉందో లేదో ఇలా తెలుసుకోండి

దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలో 32వేలకు పైగా గ్రూప్-డి (లెవల్-1) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. మొత్తం 32,438 పోస్టులకు గాను దేశవ్యాప్తంగా 1.08 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ఒక్క ముంబయి జోన్ నుంచే రికార్డు స్థాయిలో 15.59 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Railway Recruitment Board RRB Group D Result 2026 check online

ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) గత ఏడాది నవంబర్ 27 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 10 వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహించారు. లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన జాబితాను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ (Date of Birth) నమోదు చేసి అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి తమ స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని RRB కల్పించింది.

సీబీటీలో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశ అయిన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)కు పిలవనున్నారు. త్వరలోనే ఆయా ప్రాంతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) PET షెడ్యూల్‌ను విడుదల చేయనున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు సూచించారు.

👉 Official Website: https://rrbsecunderabad.gov.in

Post a Comment

Previous Post Next Post

Contact Form