NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. అక్టోబర్ 1 నుంచి బాలయ్య షూటింగ్? ఫ్యాన్స్‌లో జోష్!

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ అనగానే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పక్కర్లేదు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రెండో చిత్రంగా తెరకెక్కుతున్న NBK111పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా కొనసాగుతోంది.

bala krishna

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకినాడ పోర్టు సమీపంలో జరుగుతున్న షూటింగ్ సందర్భంగా యాక్షన్ సీక్వెన్స్‌లో బాలకృష్ణకు గాయం కావడంతో ఆయన మోకాలికి విజయవంతంగా సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బాలకృష్ణ ఆ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం. దీంతో అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తికాగా, మిగిలిన షెడ్యూళ్లను ఎలాంటి విరామం లేకుండా వరుసగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య అక్టోబర్ నుంచి మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారనే వార్తలు బయటకు రావడంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో “సర్జరీ అయినా బాలయ్య తగ్గేదేలే”, “జై బాలయ్య” అంటూ పెద్ద ఎత్తున పోస్టులు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే బాలయ్య అక్టోబర్ 1 నుంచి షూటింగ్‌లో పాల్గొంటారనే విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Post a Comment

Previous Post Next Post

Contact Form