భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని అంతర్జాతీయ ఫార్మాట్ల నుండి రిటైర్ అవుతున్నట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
టెస్ట్ క్రికెట్ అంటే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో అజింక్య రహానే ఒకరు. క్లిష్ట పరిస్థితుల్లో భారత జట్టును ఎన్నో కీలక విజయాల దిశగా నడిపించిన బ్యాటర్‌గా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై తన నిలకడైన బ్యాటింగ్‌తో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
టెస్ట్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా రహానే తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. పలు జట్ల తరఫున ఆడి వేలాది పరుగులు సాధిస్తూ టీ20 ఫార్మాట్‌లోనూ తన సామర్థ్యాన్ని నిరూపించాడు. అలాంటి అజింక్య రహానే అన్ని అంతర్జాతీయ ఫార్మాట్ల నుంచి తక్షణమే రిటైర్ అవుతున్నట్లు గురువారం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు.
2013లో భారత జట్టులో అరంగేట్రం చేసిన 38 ఏళ్ల రహానే తన కెరీర్‌లో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. తన కెరీర్‌లో అనేక చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి భారత క్రికెట్‌కు విశేష సేవలందించాడు.
2023లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ అనంతరం రహానే భారత జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి అవకాశం రాకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు.
అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, అజింక్య రహానే ఐపీఎల్‌తో పాటు దేశీయ క్రికెట్‌లో అభిమానులకు కనిపించే అవకాశం ఉంది. దీంతో ఆయన బ్యాటింగ్‌ను క్రికెట్ అభిమానులు ఇంకా ఆస్వాదించే అవకాశముంది.
