విమాన రవాణా ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న రంగాలలో ఒకటి. విమానాలు ప్రయాణించే దూరం, వాటి బరువు, ఇంజిన్ల సామర్థ్యం వంటి అనేక అంశాలు ఇంధన వినియోగంపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా, ఒక విమానం ఎంత ఇంధనం ఉపయోగిస్తుందో తెలుసుకోవడానికి, దాని రకం మరియు ప్రయాణ పరిస్థితులను పరిశీలించాలి. చిన్న టర్బోప్రాప్ విమానాలు తక్కువ ఇంధనం వినియోగిస్తే పెద్ద విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించే విమానాలకు ఎక్కువ మొత్తంలో ఇంధనంఅనేది అవసరమవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రయాణికులు ప్రయాణించడానికి ఉపయోగించే విమానాలు Boeing 737, Airbus A320 వంటి మిడిల్-రేంజ్ జెట్‌లు గంటకు సుమారు 2,500 నుంచి 3,000 లీటర్ల ఇంధనం ఉపయోగిస్తాయి. ఇవి గంటకు సుమారు 800–850 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కారణంగా, ఒక్క కిలోమీటర్‌కు సగటున 2.5 నుంచి 3.5 లీటర్ల వరకు ఇంధన వినియోగం ఉంటుంది.అయితే అంచనా ప్రయాణ సమయంలో ఉన్న గాలి వేగం, వాతావరణ పరిస్థితులు, మరియు ప్రయాణ బరువును బట్టి కొంత మారవచ్చు.
దీర్ఘదూర జెట్‌ల ఇంధన వినియోగం
అదేవిధంగా, Boeing 777, Boeing 787, Airbus A350 వంటి దీర్ఘదూర విమానాలు మరింత ఎక్కువ బరువును మోయగలవు కాబట్టి అవి గంటకు 5,000 నుంచి 7,000 లీటర్ల ఇంధనం వినియోగిస్తాయి.ఇవి ఎక్కువ ప్రయాణ దూరాలను కవర్ చేయడమే కాకుండా, అత్యధునిక ఇంజిన్ సాంకేతికతను ఉపయోగించి ఇంధన సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. అయినప్పటికీ, ప్రయాణ దూరం పెరిగే కొద్దీ ఇంధన అవసరమూ పెరుగుతుంది.
చిన్న విమానాల విషయానికి వస్తే, ATR 72, Q400 వంటి టర్బోప్రాప్ విమానాలు తక్కువ ఇంధనం వినియోగించడం వాటి ప్రధాన లక్షణం. ఇవి గంటకు 700–900 లీటర్ల మధ్య ఇంధనం వాడతాయి. ఇవి 450–500 కిమీ వేగంతో ప్రయాణించే కారణంగా, ఒక్క కిలోమీటర్‌కు సుమారు 1.5 నుంచి 2 లీటర్ల వరకు ఇంధన వినియోగం ఉంటుంది. చిన్న మార్గాలలో, ప్రత్యేకించి ప్రాంతీయ ప్రయాణాల్లో ఇవి ఆర్థికపరంగా ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి.
మొత్తంగా చూస్తే, ఒక విమానం ఎంత ఇంధనం వినియోగిస్తుంది అనేది అనేక అంశాలపై ఆధారపడే క్లిష్టమైన గణన. ప్రయాణికుల సంఖ్య, దూరం, గాలి పరిస్థితులు వంటి విషయంలన్నీ ఇందులో పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ, ప్రస్తుతం ఉపయోగిస్తున్న విమాన సాంకేతికత ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తూ ప్రయాణాన్ని చౌకగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చే దిశగా పురోగమిస్తోంది.
airplane fuel consumption, aircraft fuel efficiency, airplane fuel usage, aviation fuel, jet fuel consumption, fuel economy in airplanes, Boeing 737 fuel consumption, Airbus A320 fuel usage, regional aircraft fuel efficiency, airplane fuel guide